సినిమా కోసం ప్రణీత సాహసం... అనుష్క వలే తీవ్ర నిర్ణయం!

Published : Feb 15, 2021, 08:16 AM IST
సినిమా కోసం ప్రణీత సాహసం... అనుష్క వలే తీవ్ర నిర్ణయం!

సారాంశం

 బుజ్ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా ప్రణీత నటిస్తుండగా.. ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఒక పాత్రలో సన్నగా కనిపించే ప్రణీత, మరో పాత్రలో బొద్దుగా కనిపించాల్సిన అవసరం ఉందట. దీనితో ప్రణీత బరువు పెరగనున్నారన్న టాక్ వినిపిస్తుంది. 

హీరోయిన్ ప్రణీత శుభాష్ ఓ రోల్ కోసం పెద్ద సాహసమే చేయనుందట. ప్రణీత ఓ హిందీ చిత్రం కోసం బరువు పెరగనుందని సమాచారం. చక్కని రూపం, సన్నజాజి తీగలాంటి నడుము, నాజూకైన శరీరం కలిగిన ప్రణీత పాత్ర కోసం బరువు పెరగడం పెద్ద సాహసమే అని చెప్పాలి. మొదటిసారి రెండు హిందీ చిత్రాలకు ప్రణీత సైన్ చేశారు. వాటిలో అజయ్ దేవ్ గణ్ మూవీ ఒకటి. 
1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో బుజ్ మూవీ తెరకెక్కుతుంది. 

ఈ మూవీలో అజయ్ దేవ్ గణ్ కి జంటగా ప్రణీత నటిస్తుండగా.. ఆమె పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయట. ఒక పాత్రలో సన్నగా కనిపించే ప్రణీత, మరో పాత్రలో బొద్దుగా కనిపించాల్సిన అవసరం ఉందట. దీనితో ప్రణీత బరువు పెరగనున్నారన్న టాక్ వినిపిస్తుంది. గతంలో అనుష్క కూడా సైజ్ జీరో చిత్రం కోసం బరువు పెరగడం జరిగింది. సినిమా కోసం భారీగా బరువు పెరిగిన అనుష్కకు, శరీరాన్ని మరలా తగ్గించడం వల్ల కాలేదు. ఇప్పటి కూడా అనుష్క చాలా లావుగా కనిపిస్తున్నారు. 


మరి అలాంటి ప్రయోగమే చేస్తున్న ప్రణీత భవిష్యత్ ఏమిటో చూడాలి. బుజ్ తో పాటు హంగామా 2అనే మరో హిందీ చిత్రంలో ప్రణీత నటిస్తున్నారు. అలాగే రామణ అవతార అనే ఓ కన్నడ చిత్రంలో ప్రణీత నటించడం విశేషం

PREV
click me!

Recommended Stories

రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?
Sitara-Balakrishna: సితార ఘట్టమనేని మిస్‌ చేసుకున్న బాలకృష్ణ సినిమా ఏంటో తెలుసా? మంచే జరిగింది