
కష్టేఫలి అంటారు. ఎంత సూపర్ స్టార్ అయినప్పటికీ పాత్ర పర్ఫెక్షన్ కోసం కష్టపడితే మంచి ఫలితాలు దక్కుతున్నాయి. ఈ జనరేషన్ హీరోలు ఆ విషయంలో అసలు తగ్గడం లేదు. పాత్రలకు తగ్గట్లుగా తమని తాము మార్చుకుంటున్నారు. సహజత్వం కోసం కష్టపడుతున్నారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ కోసం చరణ్ చాలా కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్ బాడీ సాధించి పోలీస్ పాత్రలో ఇరగదీశాడు. రామరాజుగా చరణ్ ఆర్ ఆర్ ఆర్ మూవీలో కేకపుట్టించాడు.
కాగా చరణ్(Ram Charan) ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. రామ్ చరణ్ 15వ చిత్రంగా ఇది తెరకెక్కుతుంది. భారీ చిత్రాలకు పేరుగాంచిన శంకర్ మరింత ఉన్నతంగా రామ్ చరణ్ మూవీ తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా విడుదల కానున్న ఈ మూవీ కోసం కాంప్రమైజ్ కాకుండా ఖర్చుపెడుతున్నారు. ఈ మూవీ రామ్ చరణ్ మూడు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్లు సమాచారం అందుతుంది.
పొలిటికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతుండగా రామ్ చరణ్ పీరియాడిక్ పాత్ర కూడా ఉంటుంది అంటున్నారు. ఈ పాత్రకు సంబంధించి కొన్ని ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. మరొక పాత్రలో ఆయన స్టూడెంట్ గా కనిపిస్తారట. కాగా ఈ మూవీ కోసం చరణ్ జిమ్ లో కఠిన కసరత్తులు చేస్తున్నారు. ట్రైనింగ్ నిపుణుడు రాకేష్ ఉడియార్ శిక్షణలో శిక్షణ చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ తన వర్క్ ఔట్స్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పంచుకోగా వైరల్ అవుతుంది.
ఆర్ సి 15(RC 15) చిత్రాన్ని దిల్ రాజును నిర్మిస్తుండగా... కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ మూవీ విడుదల కానుంది. ఈ మూవీపై పరిశ్రమలో భారీ అంచనాలు ఉన్నాయి. ఆర్ ఆర్ ఆర్ తర్వాత రామ్ చరణ్ నటించిన ఆచార్య అట్టర్ ప్లాప్ కాగా శంకర్ మూవీతో ఆయన సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు.