‘ఆర్ఆర్ఆర్’పై ప్రముఖ హలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు.. తనకు నచ్చిన సీన్ ఇదేనంట..

Published : Jul 17, 2022, 03:36 PM IST
‘ఆర్ఆర్ఆర్’పై ప్రముఖ హలీవుడ్ డైరెక్టర్ ప్రశంసలు.. తనకు నచ్చిన సీన్ ఇదేనంట..

సారాంశం

‘ఆర్ఆర్ఆర్’ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన ఈ మూవీపై స్టార్స్ వరుసగా స్పందిస్తున్నారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ ప్రశంసల వర్షం కురిపించారు.  

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన ‘రణం రౌద్రం రుధిరం’ ఎంతటి  సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిన విషయమే. ఈ ఏడాది మార్చి 24న విడుదలైన ఎపిక్ ఫిల్మ్ ‘ఆర్ఆర్ఆర్’(RRR) అటు బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) స్వాతంత్ర సమరయోధుల పాత్రలో అద్భుతంగా నటించారు. వీరి నటనకు, వండర్ ఫుల్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అటు హాలీవుడ్ స్టార్స్ కూడా చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. 

ఇటీవల నెక్ట్స్ ఫ్లిక్ సీఈవో, పోర్స్ స్టార్ కేండ్రా లస్ట్ కూడా స్పందించిన విషయం తెలిసిందే. మూవీలో తమకు నచ్చిన సన్నివేశాలను పంచుకుంటూ ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్, నిర్మాత జేమ్స్ గన్ (James Gunn) కూడా స్పందించారు. టాలీవుడ్ నుంచి వచ్చిన ఈ భారీ చిత్రంలోని విజువల్  వండర్స్ కు ఫిదా అయ్యారు. అయితే నిన్న ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఇంట్లోనే ఫ్యామిలీతో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. తన భార్య, పిల్లలతో కలిసి ‘ఆర్ఆర్ఆర్’ మూవీని చూశానని తెలిపారు. సినిమాలో తనకు నచ్చిన యాక్షన్ సీక్వెన్స్ వీడియో క్లిప్ ను పంచుకున్నారు.

సినిమా రిలీజ్ అయిన నాలుగు నెలలకూ ‘ఆర్ఆర్ఆర్’ క్రేజ్ ఏమాత్రం తగ్గకపోవడం విశేషం. పైగా వరుస ప్రశంసలు దక్కడం తెలుగు సినిమాకే గర్వకారణమని చెప్పాలి. ఇక ఈ చిత్రం రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి  ప్రపంప వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గో ఇండియన్ ఫిల్మ్ గా రికార్డు క్రియేట్ చేసింది.  మూవీలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, అజయ్ దేవగన్, శ్రియా శరన్ కీలక పాత్రల్లో నటించిన విషయం తెలిసిందే. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను రూపొందించారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణీ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. 

 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా