రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. మైత్రీ బ్యానర్ లో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

Published : Mar 26, 2024, 06:41 PM ISTUpdated : Mar 26, 2024, 07:41 PM IST
రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్.. మైత్రీ బ్యానర్ లో ఇన్ని సినిమాలు వస్తున్నాయా?

సారాంశం

తెలుగు ఇండస్ట్రీలో సెన్సేషనల్ చిత్రాలను నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers). ప్రస్తుతం ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర హీరోలతో బిగ్ ప్రాజెక్ట్స్ ను నిర్మిస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్.. తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనాత్మకమైన సినిమాలను నిర్మిస్తోంది. ఆడియెన్స్ కు సరికొత్త సినిమా ప్రపంచాన్ని  అందిస్తోంది. చిన్నపెద్ద అనే తేడా లేకుండా చిత్ర నిర్మాణ రంగంలో దూసుకెళ్తోంది. గతంలో ‘పుష్ప’ (Pushpa)  చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఈ సంక్రాంతికి ‘హనుమాన్’ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి విన్నర్ గా నిలిచారు. 

అయితే ప్రస్తుతం అత్యధిక చిత్రాలు నిర్మిస్తున్న ప్రొడక్షన్ హైజ్ గా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ వారు నిలిచారు. వీరి ప్రొడక్షన్ హౌజ్ లో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ విషయానికొస్తే.. ఏకకాలంలో పదకొండు సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. అవి...

1. అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలోని ‘పుష్ప 2 : ది రూల్’ (Pushpa2: The Rule)
2. రామ్ చరణ్ - సుకుమార్ కాంబోలోని ‘ఆర్సీ17’ (RC17) 
3. జూనియర్ ఎన్టీఆర్ (NTR)  - ప్రశాంత్ నీల్ కాంబోలోని ‘ఎన్టీఆర్31’ (NTR31) 
4. ప్రభాస్ - హను రాఘవపూడి కాంబోలో చిత్రం
5. పవన్ కళ్యాణ్ - హరీశ్ శంకర్ కాంబోలోని ‘ఉస్తాద్ భగత్ సింగ్’
6. గుడ్ బ్యాడ్ అగ్లీ... అజిత్ కుమార్
7. నితిన్‌ - వెంకీ కుడుముల కాంబోలని ‘రాబిన్‌హుడ్’ (Robinhood) 
8. విజయ్ దేవరకొండ -  రాహుల్ సాంకృత్యాయన్  కాంబోలో రాబోతున్న చిత్రం.
9. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వంలో ‘8 వసంతాలు’
10. నడికర్ తిలకం - టోవినో థామస్ కాంబోలోని మూవీ
11. రవితేజ - మలినేని సినిమా 

ఇందులో పుష్ప2, ఆర్సీ17, ఎన్టీఆర్31, ఉస్తాద్ భగత్ సింగ్, ఎనిమిది వసంతాలు, రాబిన్ హుడ్ వంటి చిత్రాలు అధికారికంగా ప్రకటించి షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇక ప్రభాస్, విజయ్ దేవరకొండతో పాటు తదితర ప్రాజెక్ట్స్ ను ప్రకటించాల్సి ఉంది. మరిన్నిసినిమాలను మేకర్స్ ఓకే చేసే పనిలో ఉన్నారు. ప్రస్తుతం ఆయా స్క్రిప్ట్స్ పై చర్చలు జరుపుతున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 Winner Fix: బిగ్‌ బాస్‌ విన్నర్‌ ముందే ఫిక్స్.. అదే జరిగితే సరికొత్త హిస్టరీకి శ్రీకారం
Sara Arjun: ధురంధర్ స్టార్ సారా అర్జున్ రూ.12 కోట్ల లగ్జరీ ఫ్లాట్.. వైరల్ ఫోటోలు