గురూజీకే నేర్పుతారా? ఫ్యాన్స్ మీరు ఏం పీకుతున్నారని అంటారు... గుంటూరు కారం నిర్మాత ఫైర్!

By Sambi ReddyFirst Published Mar 26, 2024, 4:12 PM IST
Highlights

గుంటూరు కారం సినిమాను ట్రోల్ చేసిన వారిపై నిర్మాత సూర్యదేవర నాగవంశీ ఫైర్ అయ్యాడు. సినిమా తీసేది వినోదం కోసం. లాజిక్స్ వెతక కూడదు అన్నారు. 
 


సంక్రాంతి కానుకగా విడుదలైన గుంటూరు కారం మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. వసూల్ పరంగా పర్లేదు అనిపించుకుంది. గుంటూరు కారం విషయంలో దర్శకుడు త్రివిక్రమ్ విమర్శలు ఎదుర్కొన్నాడు. ఈ సినిమాలో ఆయన మార్క్ కనిపించలేదు. కథలో దమ్ములేదు. కేవలం మహేష్ బాబు సినిమాను కాపాడాడు అనే కామెంట్స్ వినిపించాయి. ఈ విమర్శల మీద నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తొలిసారి స్పందించారు. 

సలార్ మూవీలో ప్రభాస్ కట్ అవుట్ తో భారీ ఫైట్స్ చేస్తుంటే ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. అలాగే సలార్ మూవీలో లాజిక్ మిస్ అయ్యిందని అన్నారు. మరి సలార్ అన్ని వందల కోట్లు ఎలా వసూలు చేసింది. ఆడియన్స్ అభిప్రాయం తప్పా?. గుంటూరు కారం మూవీలో త్రివిక్రమ్ మార్క్ మిస్ అయ్యింది. మాస్ సీన్స్ లేవని అన్నారు. హీరో మాటి మాటికి హైదరాబాద్ వెళ్లి వస్తుంటాడు. అది ఎలా సాధ్యం. లాజిక్ మిస్ అన్నారు. 

లాజిక్ కోసం మూడున్నర గంటల జర్నీ సినిమాలో చూపించలేం కదా. సినిమా తీసేది వినోదం కోసం లాజిక్స్ వెతక కూడదు.  త్రివిక్రమ్ పరిశ్రమలో గొప్ప రచయిత, దర్శకుడు... ఆయనకు సినిమా ఎలా తీయాలో మీరు నేర్పుతారా? నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్లకు సినిమా తీసే దమ్ము ఉందా? మీడియా, రివ్యూవర్స్ చేసే నెగిటివ్ కామెంట్స్ హీరోల ఫ్యాన్స్ ని హర్ట్ చేస్తాయి. అందుకే నేను రియాక్ట్ అవుతాను. అలా కాకపోతే మీరేమి పీకుతున్నారని మమ్మల్ని ఫ్యాన్స్ తిడతారు. 

సినిమాను తక్కువ చేసి ఎవరు మాట్లాడినా రియాక్ట్ అవుతాను. గుంటూరు కారం మూవీపై వచ్చిన నెగిటివ్ కామెంట్స్ మీద మాట్లాడాను. గుంటూరు కారం మూవీ విషయంలో చాలా మంది అతి చేశారు... అని నాగవంశీ అన్నారు. గుంటూరు కారం జనవరి 12న విడుదలైంది. అదే తేదీన బరిలో దిగిన హనుమాన్ సంక్రాంతి విన్నర్ గా నిలిచింది. గుంటూరు కారం మూవీలో మహేష్ కి జంటగా శ్రీలీల నటించింది. మీనాక్షి చౌదరి సెకండ్ హీరోయిన్ గా చేసింది. 

click me!