దసరా 2 వచ్చేస్తుంది... కీలక అప్డేట్ ఇచ్చిన నాని!

Published : Mar 26, 2024, 05:55 PM ISTUpdated : Mar 26, 2024, 05:57 PM IST
దసరా 2 వచ్చేస్తుంది... కీలక అప్డేట్ ఇచ్చిన నాని!

సారాంశం

హీరో నాని ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్. దసరా 2 పై కీలక అప్డేట్ వచ్చేసింది. ఆ సంగతేంటో చూద్దాం..   

2013 నానికి బెస్ట్ ఇయర్ అని చెప్పాలి. దసరా, హాయ్ నాన్న రూపంలో ఆయన రెండు హిట్స్ ఖాతాలో వేసుకున్నాడు. ముఖ్యంగా దసరా భారీ విజయం సాధించింది. వంద కోట్లకు పైగా వసూళ్ళతో సత్తా చాటింది. వరల్డ్ వైడ్ దసరా రూ. 118 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టినట్లు సమాచారం. నాని ఈ చిత్రంలో డీ గ్లామర్ రోల్ చేశాడు. లవ్, ఫ్రెండ్షిప్, ఎమోషన్, రివేంజ్ అంశాలు ప్రధానంగా దసరా తెరకెక్కింది. సమ్మర్ కానుకగా మార్చి 30న మూవీ విడుదల చేశారు. 

నానికి జంటగా కీర్తి సురేష్ నటించింది. దీక్షిత్ శెట్టి కీలక రోల్ చేయగా... మలయాళ నటుడు షైన్ టామ్ చకో నెగిటివ్ రోల్ చేశాడు. దసరా విడుదలై ఏడాది కావొస్తుంది. దసరా 2 అప్డేట్ ఇచ్చారు యూనిట్. దసరా 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఈ ఏడాది ద్వితీయార్థం నుండి మొదలు కానుందట. అంటే 2024 చివర్లో లేదా 2025 ప్రారంభంలో షూటింగ్ మొదలయ్యే సూచనలు కలవు. ఇది నిజంగా నాని ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకునే వార్త అనడంలో సందేహం లేదు. శ్రీకాంత్ ఓదెల దసరా చిత్ర దర్శకుడు. పార్ట్ 2 సైతం ఆయనే తెరకెక్కించనున్నారు. 

ప్రస్తుతం వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు. అలాగే సాహో ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో ఒక మూవీ ప్రకటించాడు. యువ దర్శకుడు శైలేష్ కొలను హిట్ , హిట్ 2 చిత్రాలు తెరకెక్కించాడు. ఈ సిరీస్లో నాని హీరోగా హిట్ 3 ప్రకటించిన విషయం తెలిసిందే. కాబట్టి దసరా 2 అనేది నాని చేతిలో ఉన్న నాలుగో ప్రాజెక్ట్. 2025లో నాని నుండి రెండు చిత్రాలకు పైగా విడుదలయ్యే సూచనలు కలవు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?
700 కోట్లకు పైగా ఆస్తి, 10 ఏళ్ల చిన్నవాడిని పెళ్లాడిన హీరోయిన్, బెడ్ రూమ్ సీక్రేట్ వెల్లడించిన బ్యూటీ ఎవరు?