మలయాళ నటిని తన మాజీ ప్రియుడు చావు దెబ్బలు కొట్టాడు. అతని వేధింపులు తట్టుకోలేక తాజాగా పోలీసులను ఆశ్రయించింది. తీవ్రంగా గాయపడ్డ ఆమె ఫొటోలను షేర్ చేస్తూ సోషల్ మీడియాలోనూ ఆవేదన వ్యక్తం చేసింది.
మలయాళ నటి అనికా విక్రమన్ (Anicka Vikhraman) కొద్దికాలంగా పాపులర్ అవుతూ వస్తున్నారు. వరుస అవకాశాలను అందుకుంటూ క్రేజ్ సంపాదించుకుంటోంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే ఉండే యంగ్ బ్యూటీ.. తాజాగా తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టెంది. నటి అనికా విక్రమన్ తన మాజీ ప్రియుడు అనూప్ పిళ్లై మానసికంగా, శారీరకంగా తనను హింసించాడని ఆరోపించింది. ఈ మేరకు తనను గాయపరిచిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
మరోవైపు తన మాజీ బాయ్ ఫ్రెండ్ పైనా పోలీసులకు ఫిర్యాదు కూడా చేసింది. అతని నుంచి తనకు మళ్లీ వేధింపులు ఎక్కువయ్యాయని, బెదిరింపులు కూడా వస్తున్నాయంటూ వాపోయింది. ఈ సందర్భంగా ఇన్ స్టా ద్వారా అతను తనను ఎలా హింసించాడో ఓ సుధీర్ఘమైన నోట్ రాసుకొచ్చింది. తనకు జరిగిన అన్యాయాన్ని నెటిజన్ల ముందు పెట్టింది. తను షేర్ చేసిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
గాయపడ్డ ఆమె ముఖం, కళ్లు, శరీరంపైన ఉన్న గాయాలను చూపిస్తూ ఫొటోలను షేర్ చేసుకుంది. ప్రస్తుతం మలయాళం ఇండస్ట్రీలో ఇది హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఘటన కొద్దిరోజుల ముందే జరిగిందని తెలిపింది. అప్పట్లో బాగానే ఉన్న పిళ్లై రాక్షసుడిగా మారుతూ వచ్చాడని చెప్పింది. అతడికి దూరంగా ఉంటున్నా వదిలిపెట్టడం లేదంటూ తాజాగా వాపోయింది. ‘నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. నన్ను మరియు నా కుటుంబాన్ని నిరంతరం అందోళనకు గురిచేస్తున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం తాను పూర్తిగా కోలుకున్నానని, షూటింగ్‌లకు కూడా వెళ్లడం ప్రారంభించానని తెలిపింది.