
హీరోయిన్ లావణ్య త్రిపాఠి మెగా కోడలు అవుతున్న విషయం తెలిసిందే. నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ఆమెను ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. గత ఐదేళ్లుగా వీరు డేటింగ్ చేస్తున్నారని సమాచారం. 2017లో మిస్టర్ మూవీ కోసం జత కట్టిన వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. రెండేళ్లుగా వరుణ్ తేజ్-లావణ్యల పెళ్లి పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇటీవల అధికారికంగా ప్రకటించారు. జూన్ 9న నిశ్చితార్థ వేడుకకు ముహూర్తం ఫిక్స్ చేశారు.
నాగబాబు నివాసమైన మణికొండ ఫామ్ బీడ్ గేటెడ్ కమ్యూనిటీలో వరుణ్ తేజ్-లావణ్యల నిశ్చితార్థం వేడుక జరిగింది. సాయంత్రం 7-8 గంటల మధ్య వరుణ్-లావణ్య ఉంగరాలు ఒకరికొకరు ధరింపజేసి నిశ్చితార్థం పూర్తి చేశారు. వరుణ్ తేజ్ నిశ్చితార్థం వేడుకకు మెగా ఫ్యామిలీ మొత్తం తరలి వచ్చింది. అల్లు అర్జున్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తో పాటు కుటుంబ సభ్యులు ఈ వేడుకలో పాల్గొన్నారు. రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి వేడుకకు వచ్చారు.
ఉపాసన, రామ్ చరణ్ కొత్త జంటను ఆశీర్వదించారు. బెస్ట్ విషెస్ తెలియజేశారు. మెగా ఫ్యామిలీకి ఉపాసన పెద్ద కోడలు కాగా రెండో కోడలిగా లావణ్య రానుంది. ఈ క్రమంలో ఉపాసన ట్విట్టర్ వేదిక లావణ్య త్రిపాఠిపై ప్రేమను కురిపించారు. డియరెస్ట్ లావణ్య కొణిదెల ఫ్యామిలీకి నీకు స్వాగతం. తోడి కోడలిగా నీ రాక కోసం ఎదురుచూస్తున్నాను.నువ్వు భార్యగా వస్తున్నందుకు వరుణ్ చాలా హ్యాపీగా ఉన్నారు...' అని కామెంట్ చేశారు. ఉపాసన పోస్ట్ వైరల్ అవుతుంది.