క్రేజీ న్యూస్.. రజినీకాంత్ సినిమాలో అమితాబ్ బచ్చన్.. 32 ఏళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పైకి తలైవా, బిగ్ బీ

By Asianet News  |  First Published Jun 10, 2023, 3:34 PM IST

మూడు దశాబ్దాల తర్వాత రజినీకాంత్, అమితాబ్ బచ్చన్ జంటగా మళ్లీ బిగ్ స్క్రీన్ పైకి రాబోతున్నారు. తలైవా నటిస్తున్న170వ చిత్రంలో అభిమానులకు ఈ వండర్ ఫుల్ ఫీలింగ్ మరోసారి కలగబోతోంది. 
 


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ (Rajinikanth) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు.  అయితే ఈ మధ్య స్టార్ హీరోల కాంబినేషన్ లు సెట్ అవుతున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా మల్టీస్టారర్లు సెట్ అవుతున్న విషయం తెలిసిందే. మరోవైపు బిగ్ స్టార్స్ కలికలో, గెస్ట్ అపియరెన్స్ లో ప్రేక్షకుల ముందుకు సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. 

ఈ సందర్భంగా తమిళ సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajinikanth)  చిత్రం గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్వరలో రజినీకాంత్ - కేఈ జానవేల్ రాజా డైరెక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు చకాచకా కొనసాగుతున్నాయి. తర్వలోనే షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ చిత్రంతో ఇప్పటికే సీనియర్ నటుడు అర్జున్ ఈ చిత్రంలో విలన్ పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. లైకా ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించబోతున్నారు. 

Latest Videos

తాజాగా ఈ చిత్రం గురించి మరో ఇంట్రెస్టింగ్ గా న్యూస్ వినిపిస్తోంది. తలైవా170వ చిత్రంలో బిగ్ బీ  అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)  కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి బిగ్ స్క్రీన్‌పై వస్తున్నారనే హాట్ న్యూస్ ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. 

సూపర్‌స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్', 'లాల్ సలామ్' (కేమియో)లో నటిస్తూ బిజీగా ఉన్నారు. త్వరలో 'తలైవర్ 170' చిత్రం ప్రారంభం కాబోతుంది. దర్శకుడు TJ జ్ఞానవేల్‌  చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. అయితే ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటించబోతున్నారని తెలుస్తోంది. 

గతంలో సూపర్ స్టార్స్ రజనీకాంత్, అమితాబ్ బచ్చన్ కలిసి ఓ చిత్రంలో నటించారు.  1991లో రిలీజ్ అయిన బాలీవుడ్ బిగ్గీ 'హమ్'లో ఇద్దరూ బిగ్ స్క్రీన్ పై అలరించారు. దాంతర్వాత  ఇప్పుడు వీరిద్దరూ 32 ఏళ్ల తర్వాత మళ్లీ భారీ స్క్రీన్ కాంబినేషన్‌లో నటిస్తున్నారు. 
లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న తలైవర్ 170తో బిగ్ స్క్రీన్ పైకి రాబోతున్నారు. ఈ సినిమా ఇంటెన్స్ డ్రామాగా ఉంటుందని, ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. 

click me!