`కొమురంభీముడో` పాట హాలీవుడ్‌ సంచలన చిత్రం నుంచి లేపిందే.. నిజం బయటపెట్టిన రాజమౌళి..

Published : Feb 21, 2023, 03:43 PM IST
`కొమురంభీముడో` పాట హాలీవుడ్‌ సంచలన చిత్రం నుంచి లేపిందే.. నిజం బయటపెట్టిన రాజమౌళి..

సారాంశం

`ఆర్‌ఆర్‌ఆర్‌`లో కొమురంభీముడో సాంగ్‌ ఎంతగా కట్టిపడేసిందో తెలిసిందే. ఆ పాటని హాలీవుడ్‌ సంచలన చిత్రం నుంచి లేపిందేనట. తాజాగా రాజమౌళి ఆ విషయాన్ని వెల్లడించడం విశేషం.

`ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా గురించి ఇప్పుడు ప్రపంచం మాట్లాడుకుంటుంది. `నాటు నాటు` సాంగ్‌ ఆస్కార్‌కి నామినేట్‌ అయిన నేపథ్యంలో దీనిపై చర్చ మరింత పెరిగింది. మరోవైపు `ఆర్‌ఆర్‌ఆర్‌`కి ఇండియాలో కంటే అంతర్జాతీయంగానే ఎక్కువ ప్రశంసలు దక్కాయి. ఇతర దేశాల ఆడియెన్స్, ఫిల్మ్ మేకర్స్ దీన్ని బాగా ఇష్టపడ్డారు. దీంతో దీనికి `బాహుబలి`ని మించిన క్రేజ్‌ రావడం విశేషం. అయితే సినిమాలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ పాత్రలకు మంచి పేరొచ్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్‌ నటించిన `కొమురం భీముడో` పాట సినిమాకి, ఆ పాత్రకి ప్రాణం పోసింది. 

కొమురం భీమ్‌ ని రామరాజు కొట్టే సన్నివేశంలో ఈ పాట వస్తుంది. జనంలో తిరుగుబాటుని రగిల్చే విప్లవ పాట అది. దానికి విశేషం స్పందన లభించింది. పాటతో జనంలో తిరుగుబాటు రావడమే కాదు, థియేటర్లో కూర్చొన్న ఆడియెన్స్ రోమాలు సైతం నిక్కబొడిచేలా చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ ని శిక్షించే సన్నివేశాలు హృదయాలను కలచివేస్తాయి. అత్యంత కఠినంగా కొడుతూ చిత్ర హింసలు పెడుతుంటారు. అయితే ఆ సీన్లు హాలీవుడ్‌ నుంచి నుంచి లేపినవే అట(స్ఫూర్తి). తాజాగా ఈ సీక్రెట్‌ని బయటపెట్టారు రాజమౌళి. ఓ అమెరికా మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలను పంచుకున్నారు రాజమౌళి. 

సినిమాల్లో హీరో చనిపోయే సీన్లు తనకు నచ్చవట. కానీ హాలీవుడ్‌ సంచలన మూవీ `బ్రేవ్‌హార్ట్` మాత్రం తనకు బాగా నచ్చిందని చెప్పారు. కారణం అందులో హీరో స్వేచ్ఛ కోసం పోరాడే తత్వమే అని వెల్లడించారు. ఈ సందర్భంగానే ఆయన అసలు విషయం బయటపెట్టారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` చిత్రంలో కొమురం భీమ్‌ని బంధించి రాజు కొరడాతో కొట్టే సన్నివేశంలో వచ్చే పాటకి `బ్రేవ్‌ హార్ట్` చిత్రంలోని క్లైమాక్సే స్ఫూర్తి అని పేర్కొన్నాడు జక్కన్న. `బ్రేవ్‌ హార్ట్` క్లైమాక్స్ లో హీరో(మెల్‌ గిబ్సన్‌)ని ప్రత్యర్థులు ఇలానే కట్టేసి కొడుతారు. ఆ సన్నివేశాలు చూస్తే రాజమౌళి మక్కీకి మక్కి దించాడనిపించడంలో సందేహం లేదు. 

ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌`ని ఇండియన్‌ ఆడియెన్స్ కంటే వెస్టర్న్ కంట్రీస్‌ ఆడియెన్స్ ఎక్కువగా ఆదరించడానికి కారణం కూడా తెలిపారు. `ఆర్‌ఆర్‌ఆర్‌` క్లైమాక్స్ లో స్కాట్‌(విలన్‌)ని చంపమని చెబుతూ బుల్లెట్‌ వెనక్కి ఇచ్చేయ్‌ భీమ్‌ అని రామరాజు చెప్పే సీన్‌ ఉంటుంది. అది ఇండియన్‌ ఆడియెన్స్ కంటే అమెరికన్‌ ఆడియెన్స్ నుంచే ఎక్కువ స్పందన లభించిందట. దానికి కారణం చెబుతూ, తన గత చిత్రాలతో పోల్చి ఆ సందర్భంలో మరింత  యాక్షన్‌ ఇండియా ఆడియెన్స్ ఆశించారని, కానీ అమెరికన్లకి కొత్త కావడంతో ఎలాంటి అంచనాలు లేకుండా సినిమాని చూశారు. అందుకే వారికి బాగా నచ్చిందని చెప్పారు రాజమౌళి. 

భారతీయ సినిమాల నిడివి ఎక్కువ ఉంటుందని, ఫైట్లు అసహజంగా ఉంటాయని, పాట కథని డిస్ట్రర్బ్ చేస్తాయని అందుకే ఇండియన్‌ సినిమాలను ఫారెన్‌ ఆడియెన్స్ చూడరనే వాదనపై ఆయన స్పందిస్తూ, దాన్ని తాను ఏకీభవించనని, చాలా వరకు సినిమాల్లో ఇది నిజమే అని, కానీ సందర్భానుసారంగా వాటిని ఉపయోగిస్తే కథని ముందుకు తీసుకెళ్లడంతోపాటు పాటలు సినిమాకి కీలక భూమిక పోషిస్తాయన్నారు. సినిమాల్లో అద్భుతాలు జరగాలని ఆడియెన్స్ కోరుకుంటారు. ఫైట్స్ లో హీరో అసాధారణంగా ఏదైనా చేయాలని ఆడియెన్స్ అనుకునేలా చేయాలని, అలాంటి ఫీలింగ్‌ని కలిగించకపోతే ఓవరాక్షన్‌ చేస్తున్నట్టుగా భావిస్తారని తెలిపారు రాజమౌళి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Samantha Honeymoon Plans, రాజ్ తో కలిసి రొమాంటిక్ ట్రిప్ ప్లాన్ చేసిన సమంత, ఎక్కడికి వెళ్లబోతున్నారో తెలుసా?
49 ఏళ్ల వయసులో ఇండియాకు మెడల్ సాధించిన నటి, ఏకంగా 4 పతకాలతో మెరిసిన ప్రగతి