మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన కొణిదెల (Upasana Konidela)కు ఈరోజు చాలా చాలా ప్రత్యేకం. ఈ సందర్భంగా రామ్ చరణ్ దంపతులు స్పెషల్ మీడియోను అభిమానులతో పంచుకున్నారు.
మెగా ఫ్యామిలీలో మహాలక్ష్మి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. గత నెల జులై 20న మెగా ప్రిన్సెస్ జన్మిచ్చింది. అప్పటి నుంచి మెగా కుటుంబీకులు ఆనందంలో మునిగితేలుతున్నారు. రీసెంట్ గా మెగా వారసురాలికి నామకరణం చేసిన విషయం తెలిసిందే. ‘క్లీంకార’ (Klin Kaara)గా పేరు పెట్టారు. నేటితో మెగా ప్రిన్సెస్ పుట్టి నెలరోజులు పూర్తవుతోంది. పైగా ఈరోజు ఉపాసన పుట్టిన రోజు కావడం విశేషం.
ఈ శుభసందర్భంగా మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ - ఉపాసన దంపతులు అభిమానులతో కోసం స్పెషల్ మీడియోను పంచుకున్నారు. క్లీంకార ఆగమనాన్ని ప్రత్యేకమైన వీడియో ద్వారా మరోసారి పరిచయం చేశారు. హృదయానికి హత్తుకునే అందమైన వీడియోను తాజాగా విడుదల చేశారు. యాదృచ్చికంగానే జరిగినప్పటికీ గురువారంతో పాప పుట్టి నెల రోజులే అవుతుంది. గురువారం రోజునే ఉపాసన పుట్టినరోజు కావటం విశేషంగా మారింది. క్లీంకార వన్ మంత్ బర్త్ యానివర్సరీ వీడియోను టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ జోసెఫ్ ప్రతనిక్ డైరెక్ట్ చేసి నిర్మించారు.
undefined
ఈ వీడియోలో లెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖా కొణిదెలతో పాటు ఉపాసన తల్లిండ్రులు శోభా కామినేని, అనీల్ కామినేని కూడా ఉన్నాయి. కుటుంబ సభ్యులందరూ ఉన్నారు. అందదరిలోనూ ఎగ్జయిట్మెంట్, ఆనందం ఉండటాన్నిమనం గమనించవచ్చు. క్లీంకార పుట్టిన తర్వాత కుటుంబ సభ్యులు, అభిమానులు అందరూ పండుగ చేసుకున్నారు. వాటన్నింటినీ వీడియోలో అందంగా చూపించారు.
ఈ భావోద్వేగం గురించి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ``క్లీంకార పుట్టే సమయంలో మా అందరిలోనూ తెలియని టెన్షన్. అంతా సరిగ్గా జరగాలని మేం అందరూ ప్రార్థిస్తున్నాం. అందుకు తగినట్టే అన్నీ అనుకూలంగా మారి సరైన సమయం కుదరటంతో పాప ఈ లోకంలోకి అడుగు పెట్టిందని భావిస్తున్నాను. పాప పుట్టిన ఆ క్షణం మనసుకి ఆహ్లదంగా, చాలా సంతోషంగా అనిపించింది. పాప పుట్టటానికి పట్టిన 9 నెలల సమయం, అప్పుడు జరిగిన ప్రాసెస్ అంతా తలుచుకుని హ్యాపీగా ఫీలయ్యాం`` అన్నారు.
క్లీంకార రాకకు దారి తీసిన ఆ మరపురాని క్షణాలతో పాటు, పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమైన అసలు కథను కూడా వీడియోలో మనం గమనించవచ్చు. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిస్సా ప్రాంతాల్లో నివసిస్తున్న చెంచు జాతి నుంచి స్ఫూర్తిని పొందారు. సదరు చెంచు జాతి ద్రావిడు సంస్కృతిలో భాగం. వారి సంస్కృతిలోని గొప్పతనం, విలువలే పాపకు ఆ పేరు పెట్టటానికి కారణమయ్యాయి.
ఈ సందర్భంగా ఉపాసన కొణిదెల మాట్లాడుతూ ``మా పాప ద్రావిడ సంస్కృతిలో భాగం కావాలని నేను కోరుకున్నాను. ఆమె పేరుకి ముందు, వెనుక ఎలాంటి ట్యాగులను ఇవ్వకండి. అలాంటి వాటిని వారే స్వయంగా సాధించుకోవాలని నా అభిప్రాయం. పిల్లల పెంపకంలో ఇవెంతో ముఖ్యమైనవి. జీవితంలో ప్రతీ క్షణాన్ని ఆస్వాదించాలి.మనం అందరితో కలిసి సంతోషంగా ఉన్న సమయానికి విలువ ఇవ్వాలని నేను భావిస్తాను`` అన్నారు.
వారి కుటుంబాలకు సంబంధించిన ప్రత్యేకమైన వీడియోను ప్రజలకు చూపించటం ద్వారా రామ్ చరణ్, ఉపాసనలను నెటిజన్స్ అభినందిస్తున్నారు. అభిమానులు, ప్రేక్షకులు, స్నేహితులు, సన్నిహితులు, కుటుంబ సభ్యులు చూపిస్తున్న ఈ ప్రేమాభిమానాలపై చరణ్, ఉపాసన కృతజ్ఞతలు తెలియజేశారు.