ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్, ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్, రామ్ చరణ్ ట్వీట్..

Published : Mar 03, 2023, 11:46 AM IST
ప్రపంచంలోనే పెద్ద స్క్రీన్ పై ఆర్ఆర్ఆర్, ఆడియన్స్ స్టాండింగ్ ఒవేషన్, రామ్ చరణ్  ట్వీట్..

సారాంశం

ఆర్ఆర్ఆర్ కు మరో అరుదైన గౌరవం లభించింది. ప్రపంచంలోనే అతి పెద్ద స్క్రీన్ పై జక్కన్న చెక్కిన సినిమాల స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈసందర్భంగా రామ్ చరణ్ ట్విట్టర్ లో తమ ఆనందాన్ని వ్యాక్తం చేశారు. 

ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది ఆర్ఆర్ఆర్ సినిమా. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా.. టాలీవుడ్ జక్కన్న రాజమౌళి చెక్కిన ఈసినిమా ఎన్నో అంతర్జాతీయ గుర్తింపులు పొందడంతో పాటు గౌరవాలను , అవార్డ్ లను కూడా సాధించింది. ఈక్రమంలో ఆస్కార్ కు అడుగు దూరంలో ఉంది మూవీ. ఈసినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కు నామినేట్ అయ్యింది.మరో నాలుగు పాటలతో ఆస్కార్ కోసం పోటీపడుతోంది నాటు నాటు పాట. 
 
ఇక తాజాగా ఈసినిమా మరో అరుదైన గౌరవాన్ని అందుకుంది.  ఆర్ఆర్ఆర్ సినిమాను ప్రపంచంలోనే అతిపెద్ద తెరపై  స్పెషల్ గా స్క్రీనింగ్ చేశారు.  అమెరికాలోని ఏస్‌ హోటల్‌లో 1647 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌లోపులకించిపోయారు అమెరికన్ ఆడియన్స్. అంతే కాదు ఈసినిమాకు స్టాండింగ్ ఓవేషన్ ఇంచ్చారు.  ఈసందర్భంగా ఆర్ఆర్ఆర్ హీరో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఓ ట్వీట్ చేశారు. ట్విట్టర్ లో తన ఆనందాన్ని వ్యాక్తం చేసిన రామ్ చరణ్ వారితో దిగిన సెల్ఫీని పోస్ట్ చేశారు. ఈ విధంగా రాశారు. 

 

రామ్ చరణ్ ట్వీట్ చేస్తూ.. ఏస్ హోటల్‌లో RRR స్పెషల్  స్క్రీనింగ్‌ జరిగింది. ఈస్క్రీన్ పై ఆర్ఆర్ఆర్ కు ఎంత సంతోషకరమైన స్పందన వచ్చింది. ఈసందర్భంగా ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు.. మీ అందరి నుండి స్టాండింగ్ ఒవేషన్ అందుకోవడం నా జ్ఞాపకాలలో ఎప్పటికీ నిలిచిపోతుంది అంటూ.. భావోద్వేగానికి గురయ్యారు చరణ్. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. 

మరోవైపు ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా రీ రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డ్స్  గెలుచుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్స్ అవార్డుల్లో భాగంగా 5 అవార్డులు గెలుచుకుంది ఆర్ఆర్ఆర్ మూవీ. అంతే కాదు ఆస్కార్ తరువాత అంత విలువున్న గోల్డెన్ గ్లోబ్ ను కూడా సాధించింది మూవీ. అంతే కాదు ప్రపంచ ప్రఖ్యాత దిగ్గజ దర్శకులు జేమ్స్ కామరాన్ లాంటి వారి ప్రశంసలు కూడా పొందింది సినిమా. ఇక ఆస్కార్ ఒక్కటి సాధిస్తే.. ఇండియన్ సినిమా హిస్టరీని తిరిగిరాసిన దర్శకుడిగా రాజమౌళి నిలిచిపోతారు. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు