షో మ్యాన్‌గా రామ్‌చరణ్‌.. మరోయాంగిల్‌ని పరిచయంచేసిన `ఆర్‌ఆర్‌ఆర్‌` స్టార్‌..

By Aithagoni RajuFirst Published Sep 18, 2021, 11:00 PM IST
Highlights

 బిగ్‌బాస్‌5 వేదికగా ఈ ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం షోలో రామ్‌చరణ్‌ గెస్ట్ గా వచ్చి ఈ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ప్రోమోని విడుదల చేశారు. ఫస్ట్ టైమ్‌ తెలుగులో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచబోతున్నట్టు వెల్లడించారు. 

రామ్‌చరణ్‌ షో మ్యాన్‌గా మారిపోయాడు. మ్యాజిక్‌ పర్సన్‌గా మారి అబ్బురపరిచాడు. తన నట విశ్వరూపం చూపించారు. తనలోని మరో యాంగిల్‌ని చూపించాడు. మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌ `డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌`కి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. డీస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ కోసం బ్రాండ్‌ అంబాసిడర్‌గా రామ్‌చరణ్‌పై ఓ వీడియో తయారు చేశారు. గోల్డెన్‌ కలర్‌ కోట్‌, హ్యాట్‌ ధరించి రామ్‌చరణ్‌ చేసిన సందడి అంతా ఇంతా కాదు. 

 బిగ్‌బాస్‌5 వేదికగా ఈ ప్రమోషన్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. శనివారం షోలో రామ్‌చరణ్‌ గెస్ట్ గా వచ్చి ఈ డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ప్రోమోని విడుదల చేశారు. ఫస్ట్ టైమ్‌ తెలుగులో డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ని పంచబోతున్నట్టు వెల్లడించారు. బిగ్‌బాస్‌5 షో కూడా స్టార్‌ మాతోపాటు డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. తెలుగులో రాబోతున్న ప్రోగ్రామ్స్ ని చూపించారు. అయితే చరణ్‌ షో మ్యాన్‌గా చేసిన సందడినే ఇందులో ప్రధానంగా హైలైట్‌గా నిలవడం విశేషం. 

ఇక బిగ్‌బాస్‌ షోలో నాగార్జున, రామ్‌చరణ్‌ మధ్య డిస్కషన్‌ సరదాగా సాగింది. ఫిట్‌నెస్‌ విషయంలో నాగార్జునగారు ఇన్‌స్పిరేషన్‌ అని తెలిపారు. ఈ సందర్భంగా `ఆర్‌ఆర్‌ఆర్‌` సినిమా గురించి నాగార్జున అడగ్గా తనకు ఏం తెలియదన్నారు. రాజమౌళి ఏం చెప్పడం లేదని, ఏదీ చూపించడం లేదన్నారు. `ఆచార్య` చిత్రంలో నాన్నగారితో కలిసి నటించడం ఆనందంగా ఉంది. ఆయనతో సెట్‌లో గూస్‌బమ్స్ సిచ్చువేషన్‌ అని చెప్పాడు రామ్‌చరణ్‌. 

అదే సమయంలో ఇంటి సభ్యులను రామ్‌చరణ్‌కి పరిచయం చేశారు. నాగార్జున. ఒక్కొక్కరి గురించి చెప్పారు. ఉమాదేవికి మాటలు ఎక్కువగా వస్తాయని, బూతులు కూడా మాట్లాడుతుందని తెలిపారు. స్వేత వర్మ చాలా వైల్డ్ అని, లహరి చాలా బోల్డ్ అని, షణ్ముఖ్‌ దీప్తికి రోజూ ఐ లవ్యూ చెబుతాడని తెలిపారు నాగ్‌. శ్రీరామచంద్రచేత పాట పాడించారు. ప్రియాంక చాలా అందమైన అమ్మాయి అని తెలిపారు. సిరి చిచ్చరబుడ్డి అని అన్నారు. అనీ మాస్టర్ గురించి స్వయంగా రామ్‌చరణే తెలిపాడు. తన అక్క పెళ్లికి కొరియోగ్రాఫర్‌ డిజైన్‌ చేసింది అనీ మాస్టరే అని,తన జర్నీని చాలా గొప్పగా ఉంటుందని ఆమెని ఇలా కలుసుకోవడం ఆనందంగా ఉందన్నారు. 

మరోవైపు ఈ షోలో నితిన్‌, తమన్నా, నభా నటేష్‌ కలిసి నటించిన `మాస్ట్రో` చిత్ర ప్రమోషన్‌ చేశారు. డిస్నీ ప్లస్‌ హాట్‌ స్టార్‌లో రాబోతున్న ఫస్ట్ తెలుగు సినిమా అని చెబుతూ చరణ్‌ ఆ టీమ్‌ని ఆహ్వానించారు. చిత్ర విశేషాలను పంచుకున్నారు. వారిచేత డాన్స్‌ చేయించాడు చరణ్‌. 

click me!