సీనియర్ నిర్మాతతో రామ్ చరణ్?

Published : Jun 10, 2018, 02:17 PM IST
సీనియర్ నిర్మాతతో రామ్ చరణ్?

సారాంశం

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించాడు. ఆ బ్యానర్ 

క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో మెగాస్టార్ చిరంజీవి ఎన్నో సినిమాలలో నటించాడు. ఆ బ్యానర్ తో ఆయనకు మంచి సాన్నిహిత్యం ఉంది. అయితే చాలా కాలంగా ఈ బ్యానర్ వెనుకబడింది. మళ్లీ ఇంతకాలానికి సాయి ధరమ్ తేజ్ హీరోగా 'తేజ్ ఐ లవ్ యూ' అనే సినిమా తీశారు.

ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా చిరంజీవి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలను షేర్ చేసుకున్నారు. ముఖ్యంగా క్రియేటివ్ కమర్షియల్స్ అధినేత కె.ఎస్.రామారావుతో అతడికి ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అలానే రామ్ చరణ్ క్రియేటివ్ కమర్షియల్స్ లో ఓ సినిమా చేయాలనుకుంటున్నట్లు వెల్లడించారు.

రాజమౌళి సినిమా తరువాత కె.ఎస్.రామారావుతో సినిమా చేస్తానని రామ్ చరణ్ స్వయంగా చిరంజీవికి చెప్పినట్లు ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం రామ్ చరణ్.. బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇది పూర్తయిన తరువాత అక్టోబర్ నుండి రాజమౌళి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నాడు. 
 

PREV
click me!

Recommended Stories

Naga Vamsi: సంక్రాంతి సినిమాల పోటీపై నిర్మాత నాగవంశీ హాట్‌ కామెంట్‌.. `అనగనగా ఒక రాజు` ఎందుకు స్పెషల్‌ అంటే
The Raja Saab రిజల్ట్ ని ప్రభాస్‌ని ముందే ఊహించాడా? మారుతితో ఏం చెప్పాడంటే.. ది రాజా సాబ్‌ 2 అప్‌డేట్‌