శంకర్ సినిమాలో రామ్ చరణ్ పాత్రకు ఇన్సిప్రేషన్ ఆయనే?

By Surya PrakashFirst Published Nov 9, 2021, 4:38 PM IST
Highlights

పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా చిత్ర షూటింగ్‌ని పూర్తి చేసే పనిలో బిజీగా ఉంది శంకర్‌ బృందం.

నిజ జీవిత పాత్రలను ప్రేరణగా తీసుకుని సినిమాలు చేయటం కొత్తేమీ కాదు. అలాంటి సినిమాలు మంచి విజయం సాధించాయి కూడా. అయితే స్టార్స్ అలాంటి ప్రయోగాలు జోలికి వెళ్లరు. కానీ రామ్ చరణ్(Ram Charan) అలాంటి పాత్రే చేయబోతున్నట్లు సమాచారం.  సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ ని ప్రేరణగా తీసుకుని రాసిన పాత్రలో ఆయన కనిపించబోతున్నారని సమాచారం. అయితే అధికారికంగా ఈ విషయమై సమాచారం లేదు కానీ మీడియా వర్గాల్లో మాత్రం డిస్కషన్ గా మారింది.  ఆ సినిమా మరేదో కాదు శంకర్(Shankar) దర్శకత్వంలో రూపొందుతున్న `Rc15`.

మెగా పవర్‌ స్టార్‌ Ram Charan హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ మరో భారీ చిత్రానికి శ్రీకారం చుట్టారు. శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాలో జెడీగా రామ్ చరణ్ కనపడతారని, ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి రావటం ఈ సినిమాలో హైలెట్ గా ఉంటుందంటున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిందని ఇప్పటికే ప్రకటించారు. పుణెలోని సతారా ప్రాంతాల్లో జరిగిన ఈ ఫస్ట్ షెడ్యూల్‌లో యాక్షన్ సీక్వెన్స్‌లు తెరకెక్కించారు. శంకర్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమాగా, రామ్ చరణ్ 15వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. భారీ విజువల్ వండర్‌గా రూపొందించాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని మేకర్స్ ఫిక్సయ్యారట. చిత్రానికి ‘విశ్వంభ‌ర‌’ అనే టైటిల్‌ను పెట్ట‌బోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ప్రజా సేవ కోసం ఉన్నతమైన ఉద్యోగాన్ని సైతం వదులుకున్న వ్యక్తి సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ జేడీ లక్ష్మీ నారాయణ. 2019 ఎన్నికలకు ముందు సీబీఐ జేడీ ఉద్యోగానికి వాలంటరీ రిటైర్మెంట్ చేసిన జేడీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తరువాత బీజేపీలో చేరుతాడని, కొత్త పార్టీ పెట్టనున్నాడని వార్తలు వచ్చినప్పటికీ.. అనూహ్యంగా లోక్‌సత్తాలో చేరి.. ఆ పార్టీ అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరాలనుకున్నారు. ఇందుకోసం పార్టీ అధినేత చంద్రబాబునాయుడును సైతం కలిశారు. కానీ కొన్ని కారణాల వలన ఆ పార్టీలో చేరలేకపోయిన ఆయన.. ఉన్నట్లుండి జనసేనలో చేరారు. ఇక ఈ ఎన్నికల్లో విశాఖపట్నం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 

  అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో మళ్లీ యాక్టివ్ అయినట్టు కనిపించారు. గంటా శ్రీనివసరావు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారితో కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాటం చేశారు. మరోవైపు న్యాయ పోరాటం కూడా కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన మరొ కొత్త రంగాన్ని ఎంచుకున్ని తొలి అడుగు వేశారు. ఏరువాక పౌర్ణమి సందర్భంగా.. నాగలి పట్టి రైతుగా మారారు. ఎడ్ల నాగలితో దుక్కి దున్ని వ్యవసాయ పనులు మొదలు పెట్టారు లక్ష్మినారాయణ.

also read: Naatu Naatu song promo: వీర నాటు ఊర నాటు... అంచనాలు పెంచేసిన ఆర్ ఆర్ ఆర్ సాంగ్ ప్రోమో

click me!