హింసాత్మక అణచివేతను చూసి షాక్ అయ్యా!

Published : Jun 05, 2021, 04:02 PM IST
హింసాత్మక అణచివేతను చూసి షాక్ అయ్యా!

సారాంశం

శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన, తమిళుల అణచివేతకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంటరీలు సమంత అనేకం చూశారట. హింసాత్మకంగా అణచివేయబడ్డ తమిళుల కష్టాలు, మరణాలు ఎంతగానో బాధించాయని సమంత తెలియజేశారు. 

సమంత డెబ్యూ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ 2కి సూపర్ రెస్పాన్స్ దక్కింది. వివాదాల మధ్య విడుదలైన ఈ సిరీస్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఇక తమిళులకు అనుకూలంగా ఉండంతో పాటు అంతర్యుద్ధంలో శ్రీలంక తమిళులను సైన్యం అణచివేసిన తీరు చర్చించడం జరిగింది. దీంతో సిరీస్ విడుదల తరువాత తమిళులు సమంతపై కోపాన్ని తగ్గించుకున్నారు. 


ఇక సమంత నటనకు బాలీవుడ్ ఫిదా అయ్యింది. పాజిటివ్ రివ్యూలతో పాటు సమంత పెర్ఫార్మన్స్ అద్భుతం అంటూ అక్కడ మీడియా కొనియాడుతుంది. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా సమంత స్పందించారు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ కి వస్తున్న స్పందనకు ఆమె సంతోషం వ్యక్తం చేశారు. రివ్యూలు చదువుతుంటే ఆనందం కలుగుతుందని సమంత అన్నారు. అలాగే రాజీ పాత్ర కోసం ఆమె ప్రిపరేషన్ గురించి రివీల్ చేశారు. 


శ్రీలంకలో జరిగిన మానవ హక్కుల ఉల్లంఘన, తమిళుల అణచివేతకు సంబంధించిన వీడియోలు, డాక్యుమెంటరీలు సమంత అనేకం చూశారట. హింసాత్మకంగా అణచివేయబడ్డ తమిళుల కష్టాలు, మరణాలు ఎంతగానో బాధించాయని సమంత తెలియజేశారు. శ్రీలంక సైన్యం తమిళ రెబెల్స్ అణచివేత విషయంలో అవలంభించిన తీరు షాక్ కి గురిచేసిందని అన్నారు. 


ఇక ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్ లో సమంత భారత్ పై దాడికి వచ్చిన శ్రీలంక తమిళ్ రెబల్ రోల్ చేశారు. ఎటువంటి ఎమోషన్స్ లేని, కరుడుగట్టిన ఉగ్రవాదిగా ఆమె అద్భుతంగా నటించారు. సమంత ఎంట్రీ ది ఫ్యామిలీ మాన్ 2 మరింత హైప్ తెచ్చిపెట్టింది. 

PREV
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు