రామ్‌చరణ్‌కి కరోనాతో ఉలిక్కి పడ్డ మెగా ఫ్యామిలీ.. షాక్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌.. షూటింగ్‌ వాయిదా?

Published : Dec 29, 2020, 08:43 AM IST
రామ్‌చరణ్‌కి కరోనాతో ఉలిక్కి పడ్డ మెగా ఫ్యామిలీ.. షాక్‌లో `ఆర్‌ఆర్‌ఆర్‌` టీమ్‌.. షూటింగ్‌ వాయిదా?

సారాంశం

రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `ఆర్ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ఆపివేసే పరిస్థితి నెలకొంది. 

కరోనా ఇంకా విజృంభిస్తూనే ఉంది. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా అందరిని అది వెంటాడుతుంది. ఇటీవల రజనీకాంత్‌ `అన్నాత్తే` చిత్ర బృందానికి కరోనా సోకి ఆందోళనకి గురి చేసింది. ఇటీవల స్టార్‌ హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌కి కరోనా సోకింది. అయితే ఆమె కూడా హెల్దీగానే ఉన్నట్టు వెల్లడించింది. తాజాగా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌కి కరోనా సోకింది. ఆయన టెస్ట్ చేయించుకోగా కోవిడ్‌-19 పాజిటివ్‌ అని తేలింది. అయితే తనకు కరోనా లక్షణాలేవి కనిపించడం లేదని తెలిపారు. తనని టచ్‌లో ఉన్న వారి జాగ్రత్త పడాలని, టెస్ట్ చేయించుకోవాలని తెలిపారు. 

రామ్‌చరణ్‌కి కరోనా సోకడంతో ఇప్పుడు ఆ ఇద్దరికి పెద్ద టెన్షన్ పట్టుకుంది. ప్రధానంగా పెద్ద షాక్‌కి గురయింది `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌. ప్రస్తుతం రామ్‌ చరణ్‌ `ఆర్ ఆర్‌ ఆర్‌`లో ఎన్టీఆర్‌తో కలిసినటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్‌ ఆపివేసే పరిస్థితి నెలకొంది. అంతేకాదు ఎన్టీఆర్‌, రాజమౌళి, ఇతర ముఖ్య నటులు కూడా టెస్ట్ చేయించుకోవాల్సి వస్తుంది. అంతా హోం క్వారంటైన్‌ వెళ్ళి పోవాలి. ఇప్పటికే అనేక వాయిదాలతో మూడు సార్లు విడుదల వాయిదాలు వేసుకుంది టీమ్‌. ఇప్పుడు చరణ్‌కి కరోనాతో విడుదలపై సస్పెన్స్ నెలకొంది. 

మరోవైపు రామ్‌చరణ్‌కి కరోనా అని తెలియడంతో మెగా ఫ్యామిలీ ఉలిక్కి పడింది. ఇటీవల మెగా ఫ్యామిలీ కలిసి క్రిస్మస్‌ సెలబ్రేట్‌  చేసుకున్నారు. చిరంజీవి, అల్లు అర్జున్‌, సాయితేజ్‌, శిరీష్‌, కొత్త పెళ్లి జంట నిహారిక, చైతన్య, వరుణ్‌ తేజ్‌ ఇలా ఇతర మెగా ఫ్యామిలీ సభ్యులంతా ఇందులో పాల్గొన్నారు. దీంతో ఇప్పుడందరూ హోం క్వారంటైన్‌ కావాల్సి ఉంది. అంతేకాదు ఇందులో పిల్లలు కూడా ఉన్నారు. వారంతా టెన్షన్‌ పడుతున్నారు. రామ్‌చరణ్‌ వల్ల ఎవరెవరికి కరోనా సోకి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. 

మరోవైపు అభిమానులు షాక్‌కి గురవుతుంది. వారిలో ఆందోళన పెరిగింది. రామ్‌చరణ్‌ వల్ల అటు `ఆర్‌ ఆర్‌ ఆర్‌` టీమ్‌, ఇటు మెగా ఫ్యామిలీలో విపరీతమైన టెన్షన్‌ నెలకొంది. ఇదిలా ఉంటే గతంలో మెగాస్టార్‌ చిరంజీవికి కరోనా పాజిటివ్‌ అని తేలిన విషయం తెలిసిందే. `ఆచార్య` షూటింగ్‌లో పాల్గొనేందుకు ఆయన టెస్ట్ చేయించుకోగా, పాజిటివ్‌ అని వచ్చింది. దీంతో సీఎం, నాగార్జునతో సహా యావత్‌ రాష్ట్రమే ఉలిక్కి పడింది. ఆ తర్వాత మళ్లీ టెస్ట్ చేయించుకోగా నెగటివ్‌ అని తేలింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.  చరణ్‌కి కరోనా సోకిందన్న వార్త తెలిసి సినీ ప్రముఖులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని విషెస్‌ తెలియజేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Mega Heroes: డైరెక్టర్లను బ్లైండ్ గా నమ్మి మునిగిపోయిన మెగా హీరోలు.. 5 చెత్త సినిమాలు ఇవే
మీ కారణంగానే ఇప్పుడు ఇక్కడ ఉన్నాను.. రష్మిక ఎమోషనల్