తమిళనటుడు అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూత

Published : Dec 29, 2020, 08:41 AM IST
తమిళనటుడు అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూత

సారాంశం

ఆయన మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయ‌న మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. 

తమిళ నటుడు, డబ్బింగ్ ఆర్టిస్ట్ అరుణ్ అలెగ్జాండర్ కన్నుమూశారు. సోమవారం ఆయనకు గుండెపోటు రావడంతో ప్రాణాలు కోల్పోయారు. కాగా.. 48 ఏళ్ల వయసులోనే ఆయన ప్రాణాలు విడవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఆయన మృతిపట్ల సినీ పరిశ్రమ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది.
ఆయ‌న మృతికి అభిమానులతో పాటు పలువురు సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు. 

"ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లిపోతావని ఊహించలేదు. దుఃఖం ఆగట్లేదు. నీ లోటును ఎవరూ పూడ్చలేరు. నా గుండెలో ఎప్పటికీ నువ్వు పదిలంగా ఉంటావు" అంటూ దర్శకుడు కనగరాజ్‌ ఎమోషనల్‌గా ట్వీట్‌ చేశారు. 

కాగా అరుణ్‌ అలెగ్జాండర్‌ 'కోలమావు కోకిల', 'బిగిల్'‌, 'ఖైదీ', 'మాస్టర్'‌ వంటి చిత్రాల్లో నటించారు. ఖైదీలో మాదక ద్రవ్యాల ముఠాకు సహకరించే పోలీస్‌ అధికారిగా కనిపించారు. ఆయన చివరిసారిగా నటించిన 'మాస్టర్'‌ సినిమాలో స్టార్‌ హీరో విజయ్‌ ప్రధాన పాత్రలో నటించగా ఈ చిత్రం జనవరిలో విడుదల కానుంది.
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్