Bigg boss telugu 5: చివరి అవకాశం కూడా కోల్పోయిన కాజల్... బాత్రూమ్ లో బిగ్గరగా ఏడుపులు!

By team teluguFirst Published Nov 24, 2021, 1:32 PM IST
Highlights

ఇంత వరకు నేను కెప్టెన్ కాలేదు, నన్ను సేవ్ చేయాలి అంటూ కాజల్ (Kajal) శ్రీరామ్ ని రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ శ్రీరామ్ కన్విన్స్ కాలేదు, కాజల్ ని డిజ్ క్వాలిఫై చేశాడు. దానితో కెప్టెన్ అయ్యే ఛాన్స్ కాజల్ కోల్పోయింది.

బిగ్ బాస్ సీజన్ 5 (Bigg boss telugu 5) చివరి దశకు చేరింది. టైటిల్ కోసం ఎనిమిది మంది కంటెస్టెంట్స్ పోటీపడుతున్నారు. దీనితో టైటిల్ రేసు ఆసక్తికరంగా మారింది. నిన్న హౌస్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్స్ మధ్య కెప్టెన్సీ టాస్క్ నిర్వహించారు. నియంత మాటే శాసనం అనే టాస్క్ నిర్వహించిన బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో ఓ కుర్చీ ఏర్పాటు చేశారు. సైరన్ మోగిన ప్రతిసారి, ఎవరు ముందుగా వెళ్లి కుర్చీలో కూర్చుంటారో వారికి నియంత అధికారాలు సంక్రమిస్తాయి. అదే సమయంలో నిర్వహించిన గేమ్ నుండి ఆ కంటెస్టెంట్స్ కి మినహాయింపు ఉంటుంది. ఇక గేమ్ లో చివరిగా నిలిచిన ఇద్దరు కంటెస్టెంట్స్ లో ఒకరిని సేవ్ చేసి, నెక్స్ట్ రౌండ్ కి పంపే అధికారం కూడా ఉంటుంది. 


ఈ టాస్క్ లో రెండో రౌండ్ లో నియంత సింహాసనాన్ని శ్రీరామ్ (Sriram) చేజిక్కించుకున్నాడు. దీంతో మిగిలిన ఇంటి సబ్యులకు ఓ చాలెంజ్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. కాళ్లకి చెప్పులు ధరించి ఎదురుగా ఉన్న గోడపై వీలైనంత ఎత్తులో కాలితో అతికించాల్సి ఉంటుంది. ఎవరైతే ఎక్కువ ఎత్తులో ఆ చెప్పుల్ని అతికిస్తారో వాళ్లు సేవ్ అవుతారని.. తక్కువ ఎత్తులో చెప్పుల్ని అతికించిన చివరి ఇద్దరి సభ్యులు నియంత నిర్ణయం పాటించాలి. ఈ గేమ్‌లో మానస్‌ అందరికంటే ఎత్తులో  చెప్పులు అతికించగా.. రవి, కాజల్‌ తక్కువ ఎత్తులో తమ చెప్పులు అతికించారు. 


దీనితో రవి, కాజల్ ఇద్దరిలో ఒకరిని సేవ్ చేసి నెక్స్ట్ రౌండ్ కి పంపే అధికారం శ్రీరామ్ కి దక్కింది. ఇక మొదటి నుండి రవి (Ravi) తో చాలా క్లోజ్ గా ఉంటున్న శ్రీరామ్... అతన్ని సేవ్ చేసి, కాజల్ ని నెక్స్ట్ రౌండ్ కి వెళ్లకుండా ఎలిమినేట్ చేశాడు. హౌస్ లోకి వచ్చాక ఇంత వరకు నేను కెప్టెన్ కాలేదు, నన్ను సేవ్ చేయాలి అంటూ కాజల్ (Kajal) శ్రీరామ్ ని రిక్వెస్ట్ చేశారు. అయినప్పటికీ శ్రీరామ్ కన్విన్స్ కాలేదు, కాజల్ ని డిజ్ క్వాలిఫై చేశాడు. దానితో కెప్టెన్ అయ్యే ఛాన్స్ కాజల్ కోల్పోయింది. కెప్టెన్ అయ్యే చివరి అవకాశం కూడా కోల్పోవడంతో కాజల్ బాగా హర్ట్ అయ్యారు. ఆమె నేరుగా బాత్ రూమ్ కి వెళ్లి గట్టిగా ఏడ్చేశారు. ప్రస్తుతం హౌస్ లో రెండు గ్రూపులు తయారయ్యాయి. సన్నీ, మానస్, పింకీ, కాజల్ ఒక గ్రూప్ కాగా, శ్రీరామ్, రవి, షణ్ముఖ్, సిరి మరో గ్రూప్ గా ఉంటున్నారు. 

Also read షణ్ముఖ్‌ బెడ్‌పై సిరి.. హగ్‌ చేసుకుని క్షమాపణలు.. ఇన్నాళ్లకి రియలైజ్‌ అయ్యిందట..
ఇక ఈ వారం ఏడుగురు నామినేషన్స్ లో ఉన్నారు. మానస్ కెప్టెన్ కాగా ఎలిమినేషన్ నుండి మినహాయింపు పొందాడు. సిరి, ప్రియాంక, కాజల్, సన్నీ, రవి, షణ్ముఖ్, శ్రీరామ్ చంద్ర ఎలిమినేషన్ కి నామినేట్ అయ్యారు. వీరిలో ఒకరు వచ్చే వారం హౌస్ ని వీడనున్నారు. లేటెస్ట్ గా అనీ మాస్టర్, ఎలిమినేటైన విషయం తెలిసిందే. 

Also read Bigg boss season 5: బిగ్ బాస్ హోస్ట్ గా శృతి హాసన్!

click me!