ఆ స్టార్ సినిమాతో రామ్ చరణ్ హాలీవుడ్ ఎంట్రీ?

By Surya PrakashFirst Published Mar 18, 2023, 2:26 PM IST
Highlights

హాలీవుడ్ యాక్టర్లలో జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి వారితో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. 
 

 
 మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఒక్కో మెట్టు ఎక్కుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఆస్కార్ ముందు..ఆస్కార్ తర్వాత అన్నట్లు ఆయన కెరీర్ టర్న్ తీసుకోబోతోంది. రామ్ చరణ్ ఇప్పుడు తెలుగు కు మాత్రమే పరిమితం కాదు. ఆయన గ్లోబల్ స్టార్ గా అవతరిస్తున్నార. ఆర్ఆర్ఆర్ మూవీతో పెరిగిన తన రేంజిని సుస్దిర పరుచుకోవాలనకుంటున్నారు.  ఈ మూవీ రామ్ పాత్రలో అదరకొట్టిన చరణ్.. పాన్ ఇండియా కాదు కదా పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు.  ఈ నేపథ్యంలో రామ్ చరణ్ హాలీవుడ్ లో ఎప్పుడు అడుగుపెట్టబోతున్నారు అని సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఒక పాడ్ క్యాస్ట్ లో మాట్లాడుతూ రామ్ చరణ్ ఇప్పటికే ఒక హాలీవుడ్ సినిమా టాక్స్ నడుస్తున్నాయని అంతా ఓకే అయితే సినిమా కూడా మొదలవుతుందని అన్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఒకటి రెండు నెలల్లో బయటకు రానుందట. ఇక హాలీవుడ్ యాక్టర్లలో జూలియా రాబర్ట్స్, టామ్ క్రూజ్, బ్రాడ్ పిట్ వంటి వారితో నటించాలని ఉందని చెప్పుకొచ్చారు రామ్ చరణ్. 

ఇప్పటికే  హాలీవుడ్ దర్శక, నిర్మాతలతో కలిసి పని చేయాలని ఉందని రామ్ చరణ్ పేర్కొన్నారు.    'స్టార్ వార్స్' దర్శకుడు జేజే అబ్రహంను కలిసినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదని ఆస్కార్ వేడుకల్లో చరణ్ తెలిపారు. ''హాలీవుడ్ సినిమాలో క్యారక్టర్ గురించి చర్చలు జరుగుతున్నాయి. అయితే, అది జేజే అబ్రహంతో కాదు'' అని చెప్పారు. 

మరో ప్రక్క హాలీవుడ్ టాప్ స్టార్ టామ్ క్రూజ్ 'టాప్ గన్ 3'లో రామ్ చరణ్ నటించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. ఇండియా టుడే కాన్‌క్లేవ్‌లో శుక్రవారం రామ్ చరణ్ పాల్గొన్నారు. అక్కడ హాలీవుడ్ డెబ్యూ గురించి టాపిక్ వచ్చింది 'హాలీవుడ్ సినిమా చేస్తున్న మాట నిజమేనా? హాలీవుడ్ సినిమా ఆఫర్ వచ్చిందని చదివా' అని అడిగితే... ''ఇప్పుడే చెప్పడం తొందరపాటు అవుతుంది. చర్చలు జరుగుతున్నాయి. మీరంతా ఆశీర్వదించండి. జరిగేలా చూస్తా'' అని రామ్ చరణ్ రిప్లై ఇచ్చారు. 

ఇక హాలీవుడ్ సినిమాకు సంతకం చేశారా? లేదా చేసే ప్రాసెస్‌లో ఉన్నారా? అని అడిగితే... ''ప్రాసెస్ జరుగుతోంది. జరిగే వరకు ప్రతిదీ ప్రాసెస్‌లో ఉంటుంది. హాలీవుడ్ సినిమా చేయడం అనేది తప్పకుండా జరుగుతుంది'' అని రామ్ చరణ్ పేర్కొన్నారు.  ''మీ సౌత్ జనాలతో ఇదే సమస్య, అంచనాలు తగ్గిస్తూ ఒకేసారి భూమ్ అంటూ వెల్లడిస్తారయ్యా... టామ్ క్రూజ్ కు అపోజిట్ గా 'మేవరిక్ 3'లో రామ్ చరణ్ అని మేం వింటాం'' అంటూ రాజ్‌దీప్ సర్ దేశాయి వ్యాఖ్యానించారు. 

''మా అమ్మ ఎప్పుడూ దిష్టి తగలకూడదని చెబుతుంది. ప్రతిభకు ప్రశంశలు లభించే ప్రతి ఇండస్ట్రీలో పని చేయాలని అందరూ కోరుకుంటారు. నేను కూడా హాలీవుడ్ సినిమా చేయాలని కోరుకుంటున్నా'' అని చరణ్ తెలిపారు.  రామ్ చరణ్ తెలుగులో శంకర్ దర్శకత్వంలో ఒక సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ "ఉప్పెన" ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నారు.

click me!