ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు లాన్స్ రెడ్డిక్ మరణం, షాక్ లో హాలీవుడ్

Published : Mar 18, 2023, 02:05 PM IST
ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం, ప్రముఖ నటుడు లాన్స్ రెడ్డిక్ మరణం, షాక్ లో హాలీవుడ్

సారాంశం

ఫిల్మ్ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. వరుసగా టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ వుడ్ నటులు మరణిస్తున్న క్రమంలో.. తాజాగా హాలీవుడ్ నుంచి పాపులర్ యాక్టర్ రెడ్డిక్ తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయారు.   

సినిమా పరిశ్రమను విషాదాలు వెంటాడుతున్నాయి. మొన్నటి వరకూ టాలీవుడ్ లో వరుసగా పెద్ద పెద్ద నటులంతా దూరం అయ్యారు. ఆతరువాత కోలీవుడ్ లో కూడా చాలా మంది తారలు ఆకాశాన్ని చేరారు.. బాలీవుడ్ నుంని కూడా ఇండస్ట్రీ మరణాలు చూస్తున్నాము. ఈక్రమంలో హాలీవుడ్ నుంచి కూడా చావు కబుర్లు వినాల్సి వస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తారలు తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోతున్నారు. తాజాగా హాలీవుడ్ స్టార్ యాక్టర్ రెడ్డిక్ కన్నుమూశారు. 

తనదైన నటనతోర ప్రపంచ  సినీ ప్రేక్షుకుల మనసు గెలిచిన ప్రముఖ నటుడు లాన్స్ రెడ్డిక్. ఈ స్టార్ యాక్టర్ అనుకోకుండా..  అనూహ్యంగా కన్నుమూశారు. 60 ఏళ్ళ రెడ్దిక్ మరణవార్త  తెలియడంతో హాలీవుడ్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి.  స్టార్ ఈ వార్త తెలిసి షాక్ కు గురవుతున్నారు. ఆయన మరణం పట్ల పలువురు హాలీవుడ్ స్టార్స్  సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

రెడ్దిక్ మరణాన్ని అతని ప్రచారకర్త మియా హాన్సెన్ ధృవీకరించారు. అయితే అతను ఎక్కడ మరణించాడు అనేది అతను వెల్లడించలేదు. అయితే అతను అమెరికాలోని కాలీఫోర్నియా రాష్ట్రంలో లాస్ ఏంజల్స్ నగరంలో మరణించినట్టు సమాచారం అందుతోంది. కాని ఎలా మరించాడన్న దానిపై స్పష్టత లేదు. సహజ మరణం పొందినట్లు సమాచారం. హాలీవుడ్ లో ఎక్కువగా యాక్షన్ పిక్చర్స్ లో నటించిన  రెడ్దిక్ ఎక్కువగా ఇన్వెస్టిగేషన్  ఏజెంట్ పాత్రల్లో మెరిసారు.  అమెజాన్ వెబ్ సిరీస్ బాష్ లో కూడా నటించాడు. 1996లో వచ్చిన  న్యూయార్క్ అండర్‌కవర్,  ది వెస్ట్ వింగ్ వంటి బుల్లితెర సిరీస్ ల ద్వారా ఈ హాలీవుడ్ నటుడు ఫేమస్ అయ్యాడు. 


 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌
రూ. 50 లక్షలతో తీస్తే రూ. 100 కోట్లు వచ్చింది.. దుమ్మురేపిన ఈ చిన్న సినిమా ఏంటో తెలుసా.?