రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో పాన్‌ ఇండియా మూవీ? స్క్రిప్ట్ లాక్‌.. షూటింగ్‌, బడ్జెట్‌ డిటెయిల్స్ ?

Published : Jan 27, 2024, 10:51 PM IST
రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబోలో పాన్‌ ఇండియా మూవీ? స్క్రిప్ట్ లాక్‌.. షూటింగ్‌, బడ్జెట్‌ డిటెయిల్స్ ?

సారాంశం

రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో వచ్చిన `రంగస్థలం` చిత్రం పెద్ద విజయం సాధించింది. ఈ నేపథ్యంలో మరోసారి ఈ ఇద్దరు కలవబోతున్నారు. పాన్‌ ఇండియా సినిమాతో రాబోతున్నారు. 

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ కాంబినేషన్‌లో `రంగస్థలం` సినిమా వచ్చి పెద్ద విజయం సాధించింది. అప్పట్లో నాన్‌ `బాహుబలి` రికార్డులను క్రియేట్‌ చేసింది. రామ్‌చరణ్‌ని కొత్తగా ఆవిష్కరించిన చిత్రమిది. అదే సమయంలో సుకుమార్‌ కాస్త దిగొచ్చి సినిమా చేస్తే ఎలా ఉంటుందో ఈ చిత్రంతో చూపించారు. అప్పట్లోనే ఇది రెండు వందల కోట్లు దాటింది. అదిరిపోయే కాంబినేషన్‌గా రామ్‌ చరణ్‌, సుకుమార్‌ కాంబో నిలిచింది. 

ఇప్పుడు ఈ కాంబో రిపీట్‌ కాబోతుంది. మరోసారి ఈ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ప్రస్తుతం సుకుమార్‌.. అల్లు అర్జున్‌తో `పుష్ప2` చిత్రం చేస్తున్నారు. ఇది ఆగస్ట్ 15న విడుదల కాబోతుంది. ఆ రిలీజ్‌ డేట్‌లో మార్పు ఉండదని తెలుస్తుంది. దీంతో సుకుమార్‌ ఫ్రీ అయిపోతాడు. ఆ తర్వాత ప్రాజెక్ట్ రామ్‌చరణ్‌తో చేయబోతున్నారట. ఇప్పటికే దీనికి సంబంధించిన చర్చలు కూడా జరిగినట్టు తెలుస్తుంది. 

అంతేకాదు ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం బయటకు వచ్చింది. ఈ మూవీ స్క్రిప్ట్ కూడా లాక్‌ అయ్యిందట. డేట్స్, బడ్జెట్‌ కూడా ఫైనల్‌ అయ్యిందని అంటున్నారు. ఈ కాంబినేషన్‌లో చాలా రోజుల క్రితమే ఓకే అయ్యిందని, `పుష్ప2` పూర్తయిన తర్వాత దీనిపై వర్క్ చేయబోతున్నారని సమాచారం. అక్టోబర్ నుంచి ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్ ని స్టార్ట్ చేయబోతున్నారట. 

ఇది పాన్‌ ఇండియా మూవీగా తెరకెక్కనుందని, భారీ బడ్జెట్‌తో రూపొందిస్తారని తెలుస్తుంది. బడ్జెట్‌ని ఏకంగా నాలుగు వందల కోట్లు ఎస్టిమేట్‌ చేసినట్టు టాక్‌. ప్రస్తుతం ఈ విషయం సోషల్‌ మీడియాలో, ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతుంది. మరి ఇందులో నిజం ఎంతనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం చరణ్‌.. శంకర్‌ దర్శకత్వంలో `గేమ్‌ ఛేంజర్‌` చిత్రంలో నటిస్తున్నారు. ఇది సెప్టెంబర్‌లో రిలీజ్‌ కాబోతుంది. దీని తర్వాత బుచ్చిబాబు తో సినిమా చేస్తారు చరణ్‌, ఆ తర్వాత సుకుమార్‌ సినిమా ప్రారంభం కానుంది. బహుశా ఇది వచ్చే ఏడాది షూటింగ్‌ ప్రారంభం కానుందని తెలుస్తుంది. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?