సైలెంట్ గా OTTలోకి లోకేశ్‌ కనగరాజ్ కొత్త సినిమా.. ఏం మూవీ? ఎక్కడ చూడాలి?

By Nuthi SrikanthFirst Published Jan 27, 2024, 7:00 PM IST
Highlights

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ Lokesh Kanagaraj నుంచి కొత్త సినిమా వచ్చింది. ప్రస్తుతం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. ఇంతకీ ఆ సినిమా ఏంటీ? ఎక్కడ చూద్దామనే విషయాలు చూద్దాం. 

‘ఖైదీ’, ‘విక్రమ్’, ‘లియో’ చిత్రాలతో కోలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా ఎదిగారు లోకేష్ కనగరాజ్. ప్రేక్షకులకు యాక్షన్ ట్రీట్ అందించారు. అలాగే లోకీ యూనివర్స్ ను కూడా పరిచయం చేసి ఆసక్తిని పెంచారు. దీంతో ప్రస్తుతం ఆయన నుంచి వచ్చే సినిమాలపై ఆడియెన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో లోకేష్ కనగరాజ్ నుంచి సైలెంట్ గా ఓ సినిమా వచ్చేసింది. 

కోలీవుడ్ లో స్టార్ హీరోలతో యాక్షన్ ఫిల్మ్స్ ను తెరకెక్కిస్తున్న లోకేష్ కనగరాజ్ చిన్న సినిమాలను కూడా చేస్తున్నారు. చేయడం అంటే ఆయన దర్శకత్వంలో కాకుండా నిర్మాత సినిమాలను రూపొందిస్తున్నారు. రీసెంట్ గా తను ప్రొడ్యూసర్ గా వచ్చిన చిత్రమే ‘ఫైట్ క్లబ్’ Fight Club. నిర్మాతగా లోకేష్ నుంచి మొదటి సినిమా కావడం విశేషం. 

Latest Videos

అయితే ఈ చిత్రం ప్రస్తుతం ఓటీటీలోకి వచ్చేసింది. గతేడాది డిసెంబర్ 15నే థియేట్రికల్ రిలీజ్ కూడా జరిగింది. ఆడియెన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ చిత్రం ఓటీటీలోనూ రిలీజ్ అయ్యింది. జనవరి 27 నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా తమిళ భాషతో పాటు తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ అందుబాటులో ఉంది. 

ఇక లోకేష్ నుంచి నెక్ట్స్ భారీ చిత్రాలు రూపుదిద్దుకోనున్నాయి. ‘విక్రమ్2’, ‘తలైవా171’ వంటి సినిమాలు రావాల్సి ఉంది. ఇక టాలీవుడ్ లోనూ సినిమాలు చేసే అవకాశం ఉంది. ‘ఫ్లైట్ క్లబ్’ మూవీ విషయానికొస్తే... ఫుట్ బాల్ ప్లేయర్ గా ఎదగాలని భావించిన హీరో జీవితంలో ఓ ఘటన జరుగుతుంది. స్నేహితుడు, తన జీవితంలో పగలు, ప్రతికారాలే ఉంటాయి. అలాంటి వారి జీవితం ఎప్పుడు, ఎలాంటి మలుపులు తిరిగిందనేది సినిమా కథ. యాక్షన్ థ్రిల్లర్ ను ఇష్టపడే వారే ఈ సినిమాను తప్పకుండా చూడాల్సిందే. 

click me!