Valimai: ఫ్యాన్స్ సంబరాల్లో ఉండగా 'వలిమై' థియేటర్ పై పెట్రోల్ బాంబ్ దాడి

Sreeharsha Gopagani   | Asianet News
Published : Feb 24, 2022, 12:28 PM IST
Valimai: ఫ్యాన్స్ సంబరాల్లో ఉండగా 'వలిమై' థియేటర్ పై పెట్రోల్ బాంబ్ దాడి

సారాంశం

తమిళ అభిమానుల ఆరాధ్య హీరో అజిత్ నటించిన యాక్షన్ చిత్రం 'వలిమై' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు.

తమిళ అభిమానుల ఆరాధ్య హీరో అజిత్ నటించిన యాక్షన్ చిత్రం 'వలిమై' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువ దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కించిన ఈ చిత్రంపై తారాస్థాయి అంచనాలు ఉన్నాయి. బోని కపూర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ భామ హ్యూమా క్యురేషి హీరోయిన్ గా నటించింది. 

వలిమై విడుదల సందర్భంగా తమిళనాట సంబరాలు జరుగుతున్నాయి. కోయంబత్తూరుతో ఊహించని సంఘటన చోటు చేసుకుంది. గంగవల్లి మల్టి ప్లెక్స్ థియేటర్ వద్ద అభిమానులు సంబరాలు చేసుకుంటుండగా.. గుర్తు తెలియని కొందరు బైక్ పై వచ్చి పెట్రోల్ బాంబ్ తో దాడి చేశారు. అదృష్టవశాత్తూ ఎవరూ ఈ సంఘటనలో గాయపడలేదు. 

అక్కడే ఉన్న అభిమానులు వారిని పట్టుకునే ప్రయత్నం చేయగా వారు పారిపోయారు. దీనితో పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేశారు. దుండగులని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అజిత్, విజయ్, శింబు లాంటి క్రేజీ హీరోల సినిమాలు విడుదలైనప్పుడు థియేటర్స్ వద్ద తమిళనాడులో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి. 

అభిమానులు ప్రమాదాల్ని సైతం లెక్కచేయకుండా కటౌట్లు నిర్మించడం, పాలాభిషేకాలు చేయడం చేస్తుంటారు. ఇదిలా ఉండగా నేడు విడుదలైన వలిమై చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు వినోద్ యాక్షన్ సన్నివేశాలని హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కించారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా
Demon Pavan: తాను విన్నర్ కాదని తెలుసు, రవితేజతో బేరమాడి భారీ మొత్తం కొట్టేసిన డిమాన్ పవన్.. లక్ అంటే ఇదే