రామ్‌చరణ్, శంకర్ సినిమాని దాదాపు 150 కోట్ల నుంచి 200కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమా జోనర్ ఏంటనేది ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శంకర్ మార్క్ జోనర్‌లో రూపొందుతుందట.
`ఆర్‌సీ15`. ఈ సినిమాని ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రకటనతోనే ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు ఆకాశాన్నంటాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రారంభం కానుందట. దాదాపు 150 కోట్ల నుంచి 200కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాని తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ సినిమా జోనర్ ఏంటనేది ఆసక్తి నెలకొంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శంకర్ మార్క్ జోనర్‌లో రూపొందుతుందట. రామ్‌చరణ్ హీరోగా సైన్స్ ఫిక్షన్ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారట. గతంలో ఓ సందర్భంగా శంకర్ తనకి మంచి సైన్స్ ఫిక్షన్ చిత్రం చేయాలనుందని చెప్పారు. తాజాగా దాన్ని అభిమానులు రీట్వీట్లు చేస్తున్నారు. `ఆర్‌సీ15` సైన్స్ ఫిక్షన్‌గానే ఉంటుందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇదే నిజమైతే మెగా ఫ్యాన్స్ కి ఊగిపోవాల్సిందే అని చెప్పొచ్చు.
అయితే రామ్‌చరణ్ ప్రస్తుతం `ఆర్‌ఆర్‌ఆర్`లో నటిస్తున్నారు. ఇది త్వరలోనే పూర్తి కానుంది. ఇది పూర్తయిన వెంటనే శంకర్ సినిమాని పట్టాలెక్కించనున్నారని తెలుస్తుంది. ఇప్పటికే శంకర్ తాను రూపొందిస్తున్న `ఇండియన్ 2`ని పక్కన పెట్టేశారు. ఇప్పుడు పూర్తిగా చెర్రీ సినిమాపై ఫోకస్ పెట్టారట. అయితే దీన్ని గతంలో లాగా కాకుండా ఫాస్ట్ గా చేయాలని భావిస్తున్నారు. జనరల్‌గా శంకర్ సినిమా అంటే దాదాపు రెండుమూడేళ్లు పడుతుంది. అలా అయితే ఇప్పటికే మూడేళ్లపాటు `ఆర్‌ఆర్‌ఆర్`లో ఇరుక్కపోయిన చరణ్ మళ్లీ అదే సమస్య వస్తుంది. పైగా తన సినిమాలు వాయిదా పడుతున్న నేపథ్యంలో తాను కూడా చెర్రీ సినిమాని ఫాస్ట్ గా కంప్లీట్ చేయాలని శంకర్ భావిస్తున్నారు.
రామ్‌చరణ్.. `జెర్సీ` ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తానని కమిట్ అయ్యారు. మరిఈ సినిమాపై సస్పెన్స్ నెలకొంది. శంకర్ సినిమా పూర్తయ్యాక ఇది ఉంటుందా? లేక మధ్యలో డేట్స్ అడ్జెస్ట్ చేసుకుని ఈ సినిమా చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది.