రాజమండ్రిలో రామ్ చరణ్..!

Published : Feb 16, 2021, 01:09 PM IST
రాజమండ్రిలో రామ్ చరణ్..!

సారాంశం

ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్ కోసం రామ్ చరణ్ రాజమండ్రి చేరుకున్నారట. దర్శకుడు శివ కొరటాల లేటెస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశాడట. రాజమండ్రి గోదావరి నదీ తీరంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుందని వినికిడి. ఇక ఈ లేటెస్ట్ షెడ్యూల్ నందు చిరంజీవి కూడా పాల్గొననున్నారట. 

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తూర్పు గోదావరి జిల్లాకు వెళ్లినట్లు సమాచారం. ఆచార్య లేటెస్ట్ షెడ్యూల్ కోసం ఆయన రాజమండ్రి చేరుకున్నారట. దర్శకుడు శివ కొరటాల లేటెస్ట్ షెడ్యూల్ అక్కడ ప్లాన్ చేశాడట. రాజమండ్రి గోదావరి నదీ తీరంలో కొన్ని యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ జరుగుందని వినికిడి. ఇక ఈ లేటెస్ట్ షెడ్యూల్ నందు చిరంజీవి కూడా పాల్గొననున్నారట. 

చాలా కాలం తరువాత చిరంజీవి చిత్రం గోదావరి జిల్లాలలో చిత్రీకరణ జరుపుకోవడం విశేషం. ఇక ఆచార్య మూవీలో రామ్ చరణ్ సిద్దా అనే ఓ కీలక రోల్ చేస్తున్నారు. అరగంటకు పైగా రామ్ చరణ్ పాత్ర నిడివి ఉంటుందని తెలుస్తుంది. చిరంజీవి, రామ్ చరణ్ నటిస్తున్న పూర్తి స్థాయి మల్టీస్టారర్ గా ఆచార్య మూవీ నిలవనుంది. ఓ సామాజిక అంశాన్ని కథావస్తువుగా తీసుకొని, కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి ఆచార్య తెరక్కిస్తున్నాడు కొరటాల శివ. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. 

కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సోనూ సూద్ కీలక రోల్ చేస్తున్నారు. మణిశర్మ ఆచార్య చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆచార్య టీజర్ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సమ్మర్ కానుకగా మే 9న ఆచార్య విడుదల కానుంది. మెగా ఫ్యాన్స్ తో పాటు మూవీ లవర్స్ ఈ చిత్రం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Allu Aravind: పవన్‌ కళ్యాణ్‌ వెండితెరకు పరిచయమై 30ఏళ్లు.. అల్లు అరవింద్‌ ఎమోషనల్‌ నోట్‌
Rajinikanth Villain Movies: రజనీకాంత్‌ విలన్‌గా విశ్వరూపం చూపించిన టాప్ 5 మూవీస్‌.. సూపర్‌ స్టార్‌ కావడానికి ముందు