
రామ్ చరణ్ తగ్గేదే లే అంటున్నారు. అటు శంకర్ కూడా సై అంటున్నాడు. ఇద్దరు జెట్ స్పీడ్ తో పని చేస్తున్నారు, సూపర్ ఫాస్ట్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నారు.
రామ్ చరణ్ హీరోగా సౌత్ స్టార్ డైరెక్టర్ శంకర్ సినిమా రూపొందిస్తున్నసంగతి తెలిసిందే. ఈ సినిమాని దిల్ రాజు నిర్మిస్తున్నారు. అసలే శంకర్ సినిమా అంటే రాజమౌళి టైప్ లోనే ఈయన కూడా ఏడాదికి పైగానే చెక్కుతాడు. కాని ఈసారిమాత్రం సూపర్ స్పీడ్ గా సినిమాను కంప్లీట్ చేస్తున్నారు. ఇప్పటికే మేజర్ షూటింగ్ అయిపోయింది. ఇక కొద్ది రోజుల్లోనే మొత్తం షూటింగ్ కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారట టీమ్.
ఇంతకుముందే ఈ సినిమాకి సంబంధించిన ఓ నాలుగు షెడ్యూల్స్ ను పూర్తిచేశారు. ఆంధ్రాలోని కొన్ని ప్రాంతాలతో పాటు.. అమృత్ సర్ లో మేజర్ షెడ్యూల్ ను కంప్లీట్ చేశారు మేకర్స్. ఇక తాజాగా వైజాగ్ లో మరో షెడ్యూల్ షూటింగును మొదలుపెట్టారు. ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం చకచకా కానిచ్చేస్తున్నారట. ఈ షూటింగ్ లో రామ్ చరణ్ తో పాటు హీరోయిన్ కియారా అద్వాని కూడా జాయిన్ అయ్యింది.
చరణ్ కాలేజ్ కి సంబంధించిన సన్నివేశాలను .. ఆర్కే బీచ్ నేపథ్యంలో వచ్చే సీన్స్ ను .. చరణ్ కి పోలీసులతో గొడవ జరిగే సీన్ ను ఇంత వరకూ వైజాగ్ లో షూటింగ్ చేసినట్టు తెలుస్తోంది. మరికొన్ని రోజుల పాటు ఈ షెడ్యూల్ వైజాగ్ లోనే కొనసాగనున్నట్టుగా సమాచారం.
ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. చరణ్ సరసన హీరోయిన్ గా కియారా అద్వాని నటిస్తోంది. ఈ ఇద్దరి కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా ఇది. శ్రీకాంత్ .. సునీల్ .. అంజలి లాంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా తరువాత గౌతమ్ తిన్ననూరితో కలిసి చరణ్ సినిమా చేయబోతున్నారు. త్వరలో ఈమూవీ సెట్స్ పైకి వెళ్లనుంది.