
దర్శకుడు వేణు ఊడుగుల తెరకెక్కించిన ప్రయోగాత్మక ప్రేమకథా చిత్రం విరాటపర్వం(Virataparvam). రెవెల్యూషన్ యాన్ యాక్ట్ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా విరాటపర్వం రూపొందించారు. ఈ పీరియాడిక్ డ్రామాలో రానా (Ranadaggubati)నక్సలైట్ రోల్ చేస్తుండగా... ఆయన్ని ప్రేమించే అమాయకపు పల్లెటూరి అమ్మాయి పాత్ర సాయి పల్లవి చేస్తున్నారు. విరాటపర్వం ప్రచార చిత్రాలు, సాంగ్స్ సినిమాపై అంచనాలు పెంచాయి.
చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న విరాటపర్వం కోవిడ్ పరిస్థితుల కారణం ఆలస్యమైంది. ప్రేక్షకులతో పాటు టాలీవుడ్ వర్గాలు ఈ చిత్రం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఎట్టకేలకు అందరి నిరీక్షణ ఫలించింది. విరాటపర్వం జులై 1న (Virataparvam on july 1st) వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది. ఈ మేరకు మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ''తెలుగు నేల నడిచిన కొత్త దారుల నెత్తుటి జ్ఞాపకం మనలోంచి మన కోసం సాగిన ఓ చారిత్రక సందర్భం .ప్రేమ యుద్ధమై సాగిన విరాటపర్వం . జులై ఒకటవ తేదీన మీ ముందుకు ....'' అంటూ డైరెక్టర్ వేణు ఉడుగుల ట్వీట్ చేశారు.
అలనాటి సామాజిక అంశాలు, నక్సల్ భావజాలం, పెద్దలపై పోరాటం వంటి రెవెల్యూషన్ అంశాలకు సున్నితమైన ప్రేమ కథ జోడించి వేణు ఉడుగుల (Venu Udugula)ప్రయోగాత్మకంగా విరాటపర్వం మూవీ తెరకెక్కించినట్లు సమాచారం. టైటిల్ తోనే చిత్ర వర్గాలను ఆకర్షించిన దర్శకుడు ఈ మూవీతో టాలీవుడ్ కి ఓ సరికొత్త చిత్రం అందించడం ఖాయం అంటున్నారు. ఇక హీరో రానా, సాయి పల్లవి (Sai Pallavi)నటన సినిమాకు హైలెట్ గా నిలవనుంది. మరో టాలెంటెడ్ నటి ప్రియమణి లేడీ నక్సల్ గా కీలక రోల్ చేయడం గమనార్హం.
సురేష్ ప్రొడక్షన్స్, ఎస్ఎల్వి సినిమాస్ సంయుక్తంగా విరాటపర్వం చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సురేష్ బొబ్బిలి సంగీతం అందిస్తుండగా విడుదలైన సాంగ్స్ ఆకట్టుకున్నాయి. సాయి పల్లవి, రానా వరుస హిట్స్ తో ఫార్మ్ లో ఉన్న నేపథ్యంలో విరాటపర్వం నయా రికార్డ్స్ నమోదు చేయడం ఖాయంగా కనిపిస్తుంది.