'ఇండియన్ పీనల్ కోడ్' సీక్రెట్స్ విప్పి చెప్పబోతున్న రామ్ చరణ్

By Surya Prakash  |  First Published Sep 17, 2021, 8:48 AM IST

రామ్ చరణ్ త్వరలో భారతీయ చట్టాల్లోని లొసుగులను, వాటిని తెలుసుకున్న కార్పోరేట్ సంస్దలు చేస్తున్న వ్యాపారం, తెలియకపోవటం వల్ల సామాన్యులు ఎలా ఇబ్బందులు పడుతున్నారనే విషయాలు చెప్పటానికి రెడీ అయ్యారు.



రామ్‌చరణ్‌ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో రూపొందనున్న చిత్రం పూజా కార్యక్రమం రీసెంట్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర టీమ్ వదలిన  పోస్టర్‌ సైతం వైరల్ అయ్యింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందిస్తున్నారు. ఇప్పటికే  కొన్ని పాట‌ల‌కు సంబంధించిన రికార్డింగ్ కూడా పూర్త‌య్యింది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం కథ,టైటిల్ విషయమై మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. తాజాగా మరో విషయం బయిటకు వచ్చింది. ఈ చిత్రం కథ,క్యారక్టరైజేషన్ విషయమై కొత్త వార్త ఇది.

 ఇందులో రామ్‌చ‌ర‌ణ్ ముఖ్య‌మంత్రి పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. ఇదేమైనా ఒకేఒక్క‌డు సినిమాకు సీక్వెలా ఏంటా? అని కూడా అన్నారు. కానీ అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో రామ్ చరణ్ చేస్తున్న పాత్ర కలెక్టర్. పూర్తి  పొలిటిక‌ల్ బ్యాక్ డ్రాప్ లో న‌డిచే కథ. అలాగే ఈ సినిమాతో  భార‌తీయ చ‌ట్టాల‌పై డిస్కషన్ చేయబోతున్నారు. ఇండియన్ పీన‌ల్ కోడ్ లోని కొన్ని కీల‌క‌మైన విష‌యాల్ని…ప్రేక్షకులకు అర్థ‌మ‌య్యేలా చెప్ప‌బోతున్నాడ‌ట‌. కథలో చాలా చ‌ట్టాల్ని శంక‌ర్ ప‌రిచ‌యం చేయ‌బోతున్నారని వినికిడి. అంతేకాకుండా కార్పొరేట్ వ్య‌వ‌స్థ‌లు భార‌తీయ చ‌ట్టాల్ని అడ్డు పెట్టుకుని ఏం చేస్తున్నాయి. ఎలా గేమ్ ఆడుతున్నాయి. ఎలా ఎదుగుతున్నాయి? వాటివల్ల సామాన్యులుకు వచ్చే న‌ష్ట‌మేంటి అనేది చూపబోతున్నారు.
 
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ 50వ సినిమాగా, రామ్ చరణ్ 15వ సినిమాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. భారీ విజువల్ వండర్‌గా రూపొందించాలని, చెర్రీ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ మూవీ కావాలని మేకర్స్ ఫిక్సయ్యారట.  ఈ మూవీలో అంజలి, సునీల్‌, జయరామ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘ఇండియ‌న్‌2’ ఆగిన స‌మ‌యంలో చ‌ర‌ణ్‌ను క‌లిసిన శంక‌ర్ ఈ క‌థ చెప్ప‌ి ఒప్పించడంతో సినిమా ట్రాక్ ఎక్కేసింది. 
 

Latest Videos

click me!