లహరి శరి కోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించిన మానస్‌.. హౌజ్‌లో మరో లవ్‌ స్టోరీ షురూ!

Published : Sep 17, 2021, 12:09 AM IST
లహరి శరి కోసం గట్టి ప్రయత్నాలు ప్రారంభించిన మానస్‌.. హౌజ్‌లో మరో లవ్‌ స్టోరీ షురూ!

సారాంశం

ఈ రోజు మాత్రం లవ్‌ స్టోరీలకు ప్రయారిటీ ఇచ్చారు. షణ్ముఖ్‌ బర్త్ డే కావడంతో ఆయన లవర్‌ దీప్తి లైవ్‌లోకి ఐలవ్యూ చెప్పింది. మరోవైపు హమీదతోనూ జోడి కట్టే ప్రయత్నం చేశారు సభ్యులు. దీంతోపాటు సిరితో కలిసి షణ్ముఖ్‌పై పంచులేసింది. 

బిగ్‌బాస్‌5 షో ఆద్యంతం రంజుగా సాగుతుంది. ఇంటి సభ్యులు మరింత రెచ్చిపోయి గేమ్‌ ఆడుతున్నారు. షో ప్రారంభంలోనే ఎండింగ్‌ని తలపిస్తున్నారు. టాస్క్ ల కోసం పర్సనల్‌గా తీసుకుంటున్నారు. అయితే దాన్నుంచి రిలీఫ్‌ లభిస్తుంది. గురువారం షో ఫన్నీగా, ఎంటర్‌టైనింగ్‌గా సాగింది. అయితే ఈ రోజు మాత్రం లవ్‌ స్టోరీలకు ప్రయారిటీ ఇచ్చారు. షణ్ముఖ్‌ బర్త్ డే కావడంతో ఆయన లవర్‌ దీప్తి లైవ్‌లోకి ఐలవ్యూ చెప్పింది. మరోవైపు హమీదతోనూ జోడి కట్టే ప్రయత్నం చేశారు సభ్యులు. దీంతోపాటు సిరితో కలిసి షణ్ముఖ్‌పై పంచులేసింది. 

ఇది ఫన్నీగా సాగితే హౌజ్‌లోనే లవ్‌ స్టోరీలకు తెరలేపాడు బిగ్‌బాస్‌. తాజాగా లహరి శరి, మానస్‌ల మధ్య లవ్‌ని పుట్టించే ప్రయత్నం చేశారు. అయితే లహరి కోసం మానస్‌ సైతం గట్టిగా ప్రయత్నాలు చేయడం హైలైట్‌గా మారింది. కిచెన్‌లో లహరి వద్ద చాలా సేపు ఉన్నాడు మానస్‌. ఆమెతో ఏదో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఆ తర్వాత వీరిద్దరు కలిసి ముచ్చటించారు. లహరి చేతిని పట్టుకుని ప్రేమ ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. పరోక్షంగా ఈ జంట లవ్‌ ట్రాక్‌ని నడిపిస్తుందనే హింట్‌ ఇచ్చాడు. 

అయితే అంతకు ముందు హౌజ్‌లో సరైన అబ్బాయిలు లేరని, ఎవరినైనా పంపించండి సర్‌ అంటూ నాగార్జునకి రిక్వెస్ట్ పెట్టుకుంది లహరి. నాగ్‌కి ఇచ్చిన రోజ్‌ పువ్వుని భద్రంగా దాచుకున్నానని, సరైన అబ్బాయి తగిలితే ఫ్లవర్‌ ఇస్తానని తెలిపింది. మానస్‌ అదే ప్రయత్నాలు ముమ్మరం చేయడం, లహరి కూడా ఆయనకు సానుకూలంగా స్పందించడం చూస్తుంటే త్వరలోనే మానస్‌కి తన పువ్వుని ఇవ్వబోతుందని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్లు. 

ఇదిలా ఉంటే ఇప్పటికే హమీదతో లవ్‌ ట్రాక్‌ స్టార్ట్ చేశాడు శ్రీరామచంద్ర. బుధవారం ఎపిసోడ్‌లో టాస్క్ పూర్తయిన తర్వాత స్విమ్మింగ్‌ పూల్‌ వద్ద ఆమెకి మసాజ్‌ చేశాడు. ఆ తర్వాత చేయి పట్టుకుని ప్రేమ పాఠాలు చెప్పాడు. మొత్తంగా తామిద్దరం బుక్‌ అయిపోయామనే సిగ్నల్స్ ఇచ్చారు. మరి ఈ లవ్‌ ట్రాక్‌లు ఎంత దూరం వెళ్తాయో చూడాలి. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Ameesha Patel: నాలో సగం ఏజ్‌ కుర్రాళ్లు డేటింగ్‌కి రమ్ముంటున్నారు, 50ఏళ్లు అయినా ఫర్వాలేదు పెళ్లికి రెడీ
Bigg Boss telugu 9 లో మిడ్ వీక్ ఎలిమినేషన్, ఆ ఇద్దరిలో బయటకు వెళ్లేది ఎవరు?