చిరంజీవి, సురేఖ తన బిగ్గెస్ట్ స్ట్రెన్త్ అంటోన్న రామ్‌చరణ్‌.. మ్యారేజ్‌ డే విషెస్‌

By Aithagoni RajuFirst Published Feb 20, 2021, 10:53 AM IST
Highlights

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. ఆయన పెళ్లి రోజు నేడు. ఈ సందర్భంగా తల్లిదండ్రులకు రామ్‌చరణ్‌ వెడ్డింగ్‌ యానివర్సరి శుభాకాంక్షలు తెలియజేశారు.

`నా బిగ్గెస్ట్ స్ట్రెన్త్ అయిన మీ ఇద్దరికి 42వ పెళ్లి రోజు శుభాకాంక్షలు` అని అన్నారు మెగాపవర్‌ స్టార్‌ రామ్‌చరణ్‌. నేడు(శనివారం) మెగాస్టార్‌ చిరంజీవి, సురేఖల పెళ్లి రోజు. ఈ సందర్భంగా మొదటి విషెస్‌ని రామ్‌చరణ్‌ తెలియజేశారు. ట్విట్టర్‌ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తూ లేటెస్ట్ గా తల్లిదండ్రులు చిరంజీవి, సురేఖ కలిసి దిగిన ఫోటోని పంచుకున్నాడు. చిరంజీవి, సురేఖల జంట ఆకట్టుకుంటుంది. 

My biggest strength!!
Wishing you both a very Happy 42nd wedding anniversary 😜❤️!! pic.twitter.com/RjFyoPUbCN

— Ram Charan (@AlwaysRamCharan)

ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి అంచెలంచెలుగా ఎదిగిన విషయం తెలిసిందే. మెగాస్టార్‌గా రాణిస్తున్నారు. అయితే చిరంజీవి టాలెంట్‌, నటన ప్రతిభని, ఆయనకు వస్తోన్న క్రేజ్‌ని చూసిన హాస్య నటుడు అల్లు రామలింగయ్య తన కూతురు సురేఖని చిరంజీవికి ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటికే అల్లు రామలింగయ్య టాప్‌ కమెడియన్‌గా, నటుడిగా, నిర్మాతగా రాణిస్తున్నారు. 

సినీ పెద్ద మనుషుల మధ్య వర్తిత్వంతో చిరంజీవిని పెళ్లికి ఒప్పించడం జరిగింది. అలా 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి, సురేఖల వివాహం జరిగింది. నేటికి 42ఏళ్లు పూర్తయ్యాయి. వీరికి కుమారుడు రామ్‌చరణ్‌, కుమార్తెలు సుస్మిత, శ్రీజలు జన్మించారు. రామ్‌చరణ్‌ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే. సుస్మిత కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్నారు. 

click me!