సూపర్‌ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ?

Published : Feb 20, 2021, 08:37 AM IST
సూపర్‌ హిట్‌ సీక్వెల్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన వెంకీ?

సారాంశం

`దృశ్యం` తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు. 

మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా నటించిన `దృశ్యం` ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. ఈ సినిమా తెలుగులో `దృశ్యం`గా, తమిళంలో `పాపనాశం`గా రీమేక్‌ అయి విజయం సాధించింది. అలాగే కన్నడ, హిందీలోనూ రీమేక్‌ అయ్యి ఆకట్టుకుంది. తెలుగు రీమేక్‌లో వెంకటేష్‌, మీనా జంటగా నటించిన విషయం తెలిసిందే. తాజాగా మలయాళంలో మోహన్‌లాల్‌, మీనా జంటగా `దృశ్యం2` రూపొంది శుక్రవారం విడుదలై పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతుంది. మొదటి చిత్ర దర్శకుడు జీతూ జోసెఫ్‌ ఈ సీక్వెల్‌ని రూపొందించి హిట్‌ కొట్టాడు. 

దీంతో ఈ సీక్వెల్‌ రీమేక్‌పై చర్చ మొదలైంది. తెలుగులో వెంకీ చేస్తారా? లేదా? అనే చర్చ ఇన్నాళ్లు జరుగుతూ వచ్చింది. తాజాగా మలయాళ సినిమాకి హిట్‌ టాక్‌ రావడంతో వెంకీ కూడా తెలుగు రీమేక్‌కి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారని తెలుస్తుంది.అయితే మాతృక దర్శకుడు జీతూ జోసెఫ్‌ డైరెక్షన్‌లోనే ఈ సినిమా చేయాలని భావిస్తున్నారట వెంకీ. సురేష్‌ ప్రొడక్షన్‌ నిర్మించేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు టాక్‌. మరి ఇందులో నిజమెంతా అనేది అధికారికంగా ప్రకటిస్తేనే తెలుస్తుంది.

ప్రస్తుతం వెంకటేష్‌ `నారప్ప` చిత్రంలో నటిస్తున్నారు. ఇది మే 14న విడుదల కానుంది. దీంతోపాటు తన బ్లాక్‌ బస్టర్‌ సీక్వెల్‌ `ఎఫ్‌3`లో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటిస్తున్నారు. ఇది ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. `ఎఫ్‌2` కాంబినేషన్‌లోనే ఈ సినిమా రూపొందుతుంది. తమన్నా, మెహరీన్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్‌రాజు నిర్మిస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Chiranjeevi, Mahesh Babu సినిమాలతో పోటీ పడి టాప్ 5లో నిలిచిన హీరో, టాలీవుడ్ రాజకీయాలపై ఓపెన్ కామెంట్స్
Thalapathy Vijay సినిమా స్టోరీ లీక్, జన నాయగన్ కథ ఇదేనా? షాక్ లో మూవీ టీమ్