సినిమా డిజాస్టర్.. కానీ క్లాసిక్ అంటున్నారు.. రాంచరణ్ మూవీ ట్రెండింగ్!

Published : Nov 27, 2019, 07:16 PM ISTUpdated : Nov 27, 2019, 07:19 PM IST
సినిమా డిజాస్టర్.. కానీ క్లాసిక్ అంటున్నారు.. రాంచరణ్ మూవీ ట్రెండింగ్!

సారాంశం

కొన్ని సినిమాలు అంతే.. రిలీజ్ టైం సరిలేకనో, విపరీతంగా అంచనాలు పెరిగిపోవడం వల్లో, మరే ఇతర కారణాలవల్లో మంచి సినిమాలు కూడా దెబ్బై పోతుంటాయి. ఆ జాబితాలోకి చేరిన చిత్రమే రాంచరణ్ నటించిన ఆరెంజ్ మూవీ.

కొన్ని సినిమాలు అంతే.. రిలీజ్ టైం సరిలేకనో, విపరీతంగా అంచనాలు పెరిగిపోవడం వల్లో, మరే ఇతర కారణాలవల్లో మంచి సినిమాలు కూడా దెబ్బై పోతుంటాయి. ఆ జాబితాలోకి చేరిన చిత్రమే రాంచరణ్ నటించిన ఆరెంజ్ మూవీ. అప్పుడే రాంచరణ్ మగధీర చిత్రంతో ఇండస్ట్రీ రికార్డులని తిరగరాశారు. 

మగధీర లాంటి భారీ విజయం తర్వాత కొంత రిలీఫ్ పొందేందుకు.. అదే సమయంలో అభిమానులని కూడా అలరించేందుకు రాంచరణ్ ఆరెంజ్ చిత్రాన్ని ఎంచుకున్నాడు. ప్రేమ కథ కాబట్టి పెద్దగా రిస్క్ ఉండదని అప్పట్లో ఫామ్ లో ఉన్న బొమ్మరిల్లు భాస్కర్ పై నమ్మకం ఉంచి ఈ చిత్రానికి అంగీకరించాడు. 

మగధీర తర్వాత రాంచరణ్ మూవీపై విపరీతంగా అంచనాలు పెరిగిపోయాయి. కానీ ఆరెంజ్ మూవీ మాత్రం వైవిధ్యభరితమైన ప్రేమ కథా చిత్రం. దీనితో ప్రేక్షకులు డిజప్పాటింగ్ అయ్యారు. అలాగే ఆరెంజ్ చిత్రానికి కూడా బడ్జెట్ ఎక్కువైపోవడంతో సినిమా ఫలితం డిజాస్టర్ గా నిలిచింది. 

కానీ ఆరెంజ్ అంత తేలికగా తీసిపడేసే చిత్రం కాదు. ఆరెంజ్ క్లాసిక్ అని అభివర్ణించే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. కొంతమంది అభిమానులైతే ఏ చిత్రాన్ని రిపీటెడ్ గా చూస్తుంటారు. హారిస్ జైరాజ్ ఈ చిత్రానికి అందించిన సంగీతం అప్పట్లో ఒక సెన్సేషన్. అలాంటి ఆరెంజ్ మూవీ విడుదలై 9ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగాసోషల్ మీడియాలో ఆరెంజ్ చిత్రం ట్రెండింగ్ గా మారింది. 

రాంచరణ్ అభిమానులు #9YrsOfCultClassicORANGE అనే హ్యాష్ ట్యాగ్ తో 8 లక్షలకు పైగా ట్వీట్స్ చేశారు. రాంచరణ్ కు జోడిగా ఈ చిత్రంలో జెనీలియా నటించింది. మెగా బ్రదర్ నాగబాబు ఈ చిత్రానికి నిర్మాత. బిజినెస్ పరంగా ఆరెంజ్ చిత్రంతో నాగబాబుకు గట్టి దెబ్బే తగిలింది. 

 

PREV
click me!

Recommended Stories

Karthika Deepam 2 Latest Episode: శివన్నారాయణతో నిజం చెప్పిన శౌర్య- పారుతో ఆడుకున్న కార్తీక్
Rajamouli Heroes: రాజమౌళి హీరోల్లో ఈ ముగ్గురు మాత్రమే భిన్నం.. వరుసగా 12 ఫ్లాపులతో కెరీర్ ఆల్మోస్ట్ పతనం