రజనీ 'దర్బార్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. అనిరుధ్ మార్క్ దంచుడు!

Published : Nov 27, 2019, 06:44 PM IST
రజనీ 'దర్బార్' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. అనిరుధ్ మార్క్ దంచుడు!

సారాంశం

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సందడి మొదలైంది. సందేశాత్మక చిత్రాలని కమర్షియల్ అంశాలతో అద్భుతంగా తెరక్కించే మురుగదాస్ దర్బార్ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాల నడుమ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది.

సూపర్ స్టార్ రజనీకాంత్ దర్బార్ సందడి మొదలైంది. సందేశాత్మక చిత్రాలని కమర్షియల్ అంశాలతో అద్భుతంగా తెరక్కించే మురుగదాస్ దర్బార్ చిత్రానికి దర్శకుడు. భారీ అంచనాల నడుమ దర్బార్ మూవీ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. దీనితో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలని వేగవంతం చేస్తోంది. 

ఇటీవలే రజనీకాంత్ పోలీస్ గెటప్ లో ఉన్న మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేయగా అభిమానుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రజనీకాంత్ నుంచి ఫ్యాన్స్ స్టైలిష్ యాక్షన్, పంచ్ డైలాగులు కోరుకుంటారు. దర్శకుడు మురుగదాస్ ఈ చిత్రంలో బలమైన కథతో పాటు అభిమానులు కోరుకునే అంశాలని కూడానా అందించబోతున్నట్లు తెలుస్తోంది. 

తాజాగా దర్బార్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. రజనీకాంత్ పాత్ర గురించి తెలియజేసేలా ఫస్ట్ సాంగ్ ని డిజైన్ చేశారు. దిగ్గజ గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం ఈ పాటని పాడారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యం అందించారు. 

హుషారెత్తించేలా ఈ సాంగ్ ఉంది. రజనీకాంత్ అభిమానులని ఈ సాంగ్ ఖుషీ చేస్తుందనడంలో సందేహం లేదు. కానీ కొత్తదనం కోరుకునే సంగీత ప్రియులకు మాత్రం దర్బార్ ఫస్ట్ సాంగ్ సో సో గానే ఉంటుంది. అనిరుధ్ ఎప్పటిలాగే నాటు కొట్టుడుతో మోత మోగించాడు. 

ఈ చిత్రంలో రజనీకి జోడిగా నయనతార నటిస్తోంది. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నారు. 

 

PREV
click me!

Recommended Stories

'అప్పుడు బిగ్ బాస్ చేసిన పనికి ఆశ్చర్యపోయా.. గిఫ్ట్‌గా లిప్‌స్టిక్‌లు పంపించాడు..'
Jana Nayakudu మూవీ `భగవంత్‌ కేసరి`కి కాపీనా, రీమేకా? అసలు నిజం చెప్పిన నిర్మాత.. ట్రోల్స్ కి ఫుల్‌ స్టాప్‌