అఫీషియల్.. RC15 టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ రెడీ.. రిలీజ్ టైం ఇదే, ఉత్కంఠ పెంచేసిన దిల్ రాజు..

By Asianet NewsFirst Published Mar 26, 2023, 10:01 PM IST
Highlights

రాంచరణ్ బర్త్ డేని ఫ్యాన్స్ ఒక మెమొరబుల్ ఈవెంట్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సంబరాల జోష్ ని మరింత పెంచేలా RC15 చిత్ర యూనిట్ నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ బర్త్ డే సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా ప్రసంసలు దక్కించుకుంటున్నాడు. దీనితో రాంచరణ్ బర్త్ డేని ఫ్యాన్స్ ఒక మెమొరబుల్ ఈవెంట్ గా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

ఈ సంబరాల జోష్ ని మరింత పెంచేలా RC15 చిత్ర యూనిట్ నుంచి అదిరిపోయే ప్రకటన వచ్చింది. రేపు సోమవారం  RC15 చిత్ర ఫస్ట్ లుక్ అండ్ టైటిల్ ప్రకటించనున్నట్లు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఉదయం 8.19 గంటలకు టైటిల్ లోగో.. అలాగే ఫస్ట్ లుక్ పోస్టర్ ని మధ్యాహ్నం 3.06 గంటలకు వరుసగా రిలీజ్ చేయనున్నారు. 

ఈ చిత్రాన్ని దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ తర్వాత చరణ్ నటిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రానికి సీఈవో, సర్కారోడు అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి టైటిల్ ఏంటో రేపు ఉదయం తేలనుంది. రాంచరణ్ అభిమానులంతా ఫస్ట్ లుక్ కోసం వెయిట్ చేస్తున్నారు. 

 

Let’s celebrate Mega Powerstar ’s birthday tomorrow with the title and first look poster of .

💥💥8:19 AM & 3:06 PM💥💥

— Sri Venkateswara Creations (@SVC_official)

ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న దిల్ రాజు కూడా చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ కి హాజరయ్యారు. రేపు ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుండగా దిల్ రాజు కూడా ఉత్కంఠ పెంచేశారు. దిల్ రాజు మాట్లాడుతూ ఫ్యాన్స్ తో చిన్న క్విజ్ నిర్వహించారు. RC15 టైటిల్ మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి అంటూ.. ఏ. సర్కారోడు .. బి. సీఈవో.. సి. గేమ్ చేంజర్ అని చెప్పారు. ఆప్షన్ డి కూడా ఉంది అది సస్పెస్ ఏంటో ఫ్యాన్స్ మరింత టీజ్ చేశారు. 

RC15 నుంచి చాలా లీకులు వచ్చాయి. కానీ ఎవ్వరూ ఉహించని విధంగా ఫస్ట్ లుక్ ఉండబోతోంది అని దిల్ రాజు ప్రకటించారు. 

click me!