ఒకప్పుడు రాంచరణ్ కి కోపం ఎక్కువ.. 'ఆరెంజ్' విషయంలో జరిగిన తప్పు అదే, బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నాగబాబు

By Asianet NewsFirst Published Mar 26, 2023, 9:08 PM IST
Highlights

మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రేపు మార్చి 27న రాంచరణ్ తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనితో కొన్ని రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ జన్మదిన వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. రేపు మార్చి 27న రాంచరణ్ తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్నారు. దీనితో కొన్ని రోజుల ముందు నుంచే సోషల్ మీడియాలో హంగామా మొదలైంది. నేడు మెగా ఫ్యాన్స్ ఆధ్వర్యంలో చరణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ జరుపుకోవడానికి భారీ ఈవెంట్ నిర్వహించారు. 

ఈ ఈవెంట్ కి మెగా బ్రదర్ నాగబాబు, జనసేన పార్టీ సందీప్ పంచకర్ల, హైపర్ ఆది, డైరెక్టర్ బాబీ, రాహుల్ సిప్లిగంజ్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, మెహర్ రమేష్ లాంటి ప్రముఖులు హాజరయ్యారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో రాంచరణ్ క్రేజ్ వరల్డ్ వైడ్ వా వ్యాపించింది. నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ దక్కడంతో మెగా అభిమానుల సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి. ఆర్ఆర్ఆర్ చిత్రంతో గ్లోబల్ స్టార్ అయిన చరణ్ పుట్టినరోజు వేడుకల్ని కనీవినీ ఎరుగని విధంగా మెగా ఫ్యాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. 

ఈ ఈవెంట్ లో మెగా బ్రదర్ నాగబాబు ప్రసంగించి అభిమానులని ఆకట్టుకున్నారు. ముందుగా చరణ్ కి బర్త్ డే విషెస్ చెబుతూ నాగబాబు తన ప్రసంగాన్ని ప్రారంభించారు. రాంచరణ్ ఎదుగుదలని దగ్గరుండి చూశాను. చిన్నతనం నుంచి ఒక ఏజ్ వచ్చేవరకు చరణ్ కి కొంచెం కోపం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు చరణ్ మెచ్యూరిటీ చూస్తుంటే అద్భుతం అనిపిస్తోంది. మా జనరేషన్ తర్వాత మా ఫ్యామిలిలో మొదట పుట్టిన మగబిడ్డ రాంచరణ్. 

ప్రస్తుతం రాంచరణ్ పెద్దన్న స్థానంలో ఉండి మా ఫ్యామిలీలో తన తమ్ముళ్ళని.. అక్క చెల్లెళ్లని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు. ఎవరికి ఏ కష్టం వచ్చిన ఒక అన్నగా తన బాధ్యత నిర్వహిస్తున్నాడు. ఎవరైనా రాంగ్ ట్రాక్ లో వెళుతుంటే సరిచేస్తున్నాడు అని నాగబాబు అన్నారు. 

ఇక చరణ్ పుట్టినరోజు సందర్భంగా తాను నిర్మించిన ఆరెంజ్ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్న విషయాన్ని నాగబాబు ప్రస్తావించారు. ఆరెంజ్ చిత్రం వల్ల నేను కాస్త దెబ్బతిన్నాను. అప్పట్లో ఆ చిత్రం కేవలం యావరేజ్ గా మాత్రమే ఆడింది. కానీ ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఆ చిత్రానికి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. ఇప్పటి జనరేషన్ కి ఆ మూవీ చాలా బాగా నచ్చేస్తోంది.  ఆరెంజ్ విషయంలో తప్పు ఎక్కడ జరిగిందో ఇప్పుడు అర్థం అవుతోంది. ఒక జనరేషన్ ముందుగానే ఆ చిత్రాన్ని తీశాం అని ఇప్పుడు అర్థం అవుతోంది అంటూ నాగబాబు పేర్కొన్నారు. 

ఇక ఈ చిత్రం రీరిలీజ్ తో వచ్చిన ఫండ్ ని జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వడం తప్ప మరో గొప్ప పని నాకు కనిపించలేదు అని నాగబాబు అన్నారు. 

click me!