మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ నయా లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం ముంబైలో ఉన్న ఆయన కొత్త అవతారంలో షాకింగ్ గా సర్ ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి.
మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej) చివరిగా ‘గని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కానీ ఈ సినిమా ఆశించిన మేర ఫలితానివ్వలేదు. దీంతో తదుపరి చిత్రాలతో ఎలాగైనా హిట్ కొట్టాలని మెగా హీరో నెక్ట్స్ సినిమాలపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. ప్రస్తుతం వరుణ్ తేజ్ చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి.
ఈ చిత్రాల్లో ‘గాండివధారి అర్జున’ దాదాపు షూటింగ్ పూర్తి కావచ్చినట్టు తెలుస్తోంది. యంగ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహించారు. ఇక V13 చిత్రాన్నిడెబ్యూ డైరెక్టర్ శక్తి ప్రతాప్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నారు. ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. అయితే ఇందుకు కోసం వరుణ్ తేజ్ తాజాగా లుక్ లోకి మారిపోయాడు. మెగా ప్రిన్స్ లేటెస్ట్ లుక్ కు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.
రీసెంట్ గా ముంబైకి పయనమైన మెగాప్రిన్స్ మిలిటరీ కటింగ్, మీసాలతో అదిరిపోయే లుక్ ను సొంతం చేసుకున్నారు. స్టైలిష్ లుక్ ను చూసిన అభిమానులు ఖుషీ అవుతున్నారు. వింటేజ్ మెగాస్టార్ గా కనిపిస్తున్నారంటూ మెగా ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముంబైలోని సెలబ్రెటీ హెయిర్ స్టైలిష్ అలీమ్ హకీమ్ స్టూడియో వద్ద ఫోజులిచ్చారు. అభిమానులు సైతం వరుణ్ తేజ్ తో సెల్పీల కోసం ఆసక్తిచూపించారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
New look alert! 🚨
Mega Prince has stunned with his new look for his next film 😎. He was spotted at studio in Mumbai. pic.twitter.com/dYA8Y8CFEb