రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ క్రేజ్.. ఆ దేశంలో రంగస్థలం రిలీజ్ కుసన్నాహాలు..

By Mahesh Jujjuri  |  First Published Apr 6, 2023, 7:38 AM IST

రామ్ చరణ్ ఇమేజ్ దేశ దేశాలు దాటిపోతోంది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ కు తగ్గట్టే.. చరణ్  స్టార్ డమ్  కూడా పెరుగుతూ వస్తోంది. ఈక్రమంలోనే ఆయన సినిమాలకువిదేశాల్లో  కూడా క్రేజ్ పెరుగుతోంది.  
 


ఆర్ఆర్ఆర్ తరువాత.. రామ్ చరణ్ క్రేజ్ ఎక్కడికో వెళ్ళిపోయింది. గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఆయన పక్కన వచ్చి చేరింది. అసలు ఈ ఇమేజ్ కు చరణ్ కరెక్టేనా అని వాదించినవారికి సమాధానంగా విదేశాల్లో ఆయన క్రేజ్ అమాంతం పెరిగిపోతోంది. చరణ్ సినిమాలకు అక్కడ డిమాండ్ పెరుగుతోంది. దాంతో మనోడిసూపర్ హిట్ సినిమాలు అక్కడ స్పెషల్ స్క్రీనింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా మన టాలీవుడ్ స్టార్స్ అంటే బాగా ఇష్టపడే జపాన్ లో రామ్ చరణ్ కు ఫాన్ ఫాలోయింగ్ భారీగా పెరిగింది. ఇక త్వరలో అక్కడ రామ్ చరణ్ రంగస్థలం రిలీజ్ కు రెడీ అవుతోంది. 

ఐదేళ్ల క్రితం వచ్చిన రంగస్థలం సినిమా రామ్ చరణ్ కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అనుకోవచ్చు. ఈసినిమా నుంచే చరణ్ కంప్లీట్ గా మారిపోయాడు. సుకుమార్ డైరెక్షన్.. ఆయన క్రియేటివిటీకి తగ్గట్టు రామ్ చరణ్ నటన ఈసినిమాకు హైలెట్ గా నిలిచాయి. అంతే కాదు సమంత గ్లామర్ కూడా రంగస్థలం సినిమాకు హైలెట్ అయ్యాయి. దాంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపించింది. నటుడిగా రామ్‌చరణ్‌ను మరో స్థాయిలో నిలబెట్టింది. చరణ్‌ కెరీర్‌లో ఎన్ని బ్లాక్‌బస్టర్‌ సినిమాలున్నా రంగస్థలం మాత్రం ప్రత్యేకం. చిట్టిబాబుగా చరణ్‌ నటిన అద్భుతం అనే చెప్పాలి. మెగా తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చిన చరణ్‌కు తిరుగులేని పాపులారిటీ వచ్చింది రంగస్థలం. ఇక ఇది ఇలా ఉంటే.. ఐదేళ్ల తర్వాత రంగస్థలం మళ్లీ థియేటర్లలో సందడి చేయబోతోంది. 

Latest Videos

మాములుగానే  సౌత్‌ ఇండియన్  సినిమాలకు జపాన్‌లో మంచి క్రేజ్‌ ఉంది.  అక్కడ రజనీకాంత్, ప్రభాస్ స్టార్ హీరోల కంటే ఎక్కువగా అభిమానిస్తుంటారు. గతేడాది రిలీజైన ఆర్‌ఆర్‌ఆర్‌ తో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కూడా అంతే క్రేజ్ సాధించారు. ఆస్కార్ తో అది మరింతగా పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ సినిమాతో జపాన్‌లో చరణ్‌కు విపరీతమైన పాపులారిటీ ఏర్పడింది. ఈ క్రమంలో రంగస్థలం సినిమాను జపాన్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేస్తున్నారు. ఏప్రిల్‌ 9 నుంచి 11వ తేదీ వరకు జపాన్‌లోని చొగో సిటీలో షో వేస్తున్నారు. దీనికి వచ్చిన రెస్పాన్స్‌ను బట్టి థియేటర్‌ల సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.

సమంత హీరోయిన్‌గా నటించి.. మెప్పించిన  ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్  సంస్థ నిర్మించింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా దాదాపు 216 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్‌ చేసి నాన్‌ బాహుబలి రికార్డును క్రియేట్‌ చేసింది. ఇక ఈసినిమాకు మరింత ప్లస్ అయ్యింది దేవి ప్రసాద్‌ మ్యూజిక్ అని చెప్పాలి. దేవీ పాటలైతే పాన్ ఇండియాను  ఓ ఊపు ఊపేశాయి. ఆదిపినిశెట్టి, జగపతిబాబు, అనసూయలాంటి నటీనటులు సినిమాకు ప్లాస్ అయ్యారు. 


 

click me!