ఉస్తాద్ ఊచకోత షురూ.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్ టీమ్

Published : Apr 05, 2023, 10:36 PM ISTUpdated : Apr 05, 2023, 10:41 PM IST
ఉస్తాద్ ఊచకోత షురూ.. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేసిన హరీష్ శంకర్ టీమ్

సారాంశం

ఇంత కాలానికి డైరెక్టర్ హరీష్ శంకర్  ఎదురు చూపులు ఫలించాయి.  ఎన్నో ఏళ్ల నుంచి పవర స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్.. సినిమా ప్రకటించి కూడా నాలుగేళ్ల పైనే అవుతుంది. కాని ఆమూవీ సెట్స్ ఎక్కింది లేదు. ఇక తాజాగా ఈమూవీ సెట్స్ ఎక్కింది.    

ఇంత కాలానికి డైరెక్టర్ హరీష్ శంకర్  ఎదురు చూపులు ఫలించాయి.  ఎన్నో ఏళ్ల నుంచి పవర స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని ఎదురు చూస్తున్నాడు హరీష్ శంకర్.. సినిమా ప్రకటించి కూడా నాలుగేళ్ల పైనే అవుతుంది. కాని ఆమూవీ సెట్స్ ఎక్కింది లేదు. ఇక తాజాగా ఈమూవీ సెట్స్ ఎక్కింది.  

వర్ స్టార్ పవన్ కళ్యాణ్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ . గతంలో  భవదీయుడు భగత్ సింగ్ పేరుతో స్టార్ట్ అయిన ఈమూవీ.. సెట్స్ఎక్కలేదు. ప్రకటనకే పరిమితం అయ్యింది. ఆమూవీ నుంచి పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. ఇక అప్పటి నుంచి పెండింగ్ లోనే ఉంది ఈ ప్రాజెక్ట్.  గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా ఇండస్ట్రీ హిట్ అయిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పవన్, హరీష్ కాంబినేషన్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. 

ఇక ఫ్యాన్స్ ఎదరుచూపులు.. డైరెక్టర్ హరీష్ శంకర్ ఎదురుచూపులుఫలించి..  ఉస్తాద్ సినిమా షూటింగ్ స్టార్ట్ చేశారు టీమ్. ఈమూవీ షూటింగ్ స్టార్ట్ అయినట్టు ఓ టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మూవీ టీమ్. పవన్ కళ్యాణ్  రాజకీయంగా బీజీగా ఉండటం. ఇతర సినిమాలకు టైమ్ కేటాయించడంతో.. ఈసినిమా లేట్ అవుతూ వస్తోంది.  స్టార్ట్ చేయలేదు పవర్ స్టార్. సినిమా ను స్టార్ట్ చేయడం కోసం వేరే ప్రాజెక్ట్ ముట్టుకోకుండా.. డైరెక్టర్ హరీష్  శంకర్ కొన్నేళ్లుగా ఈ ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తున్నాడు. 

 

కాని ఇన్నాళ్ల ఎదురు చూపులకు.. ఫలితం దక్కింది. పవర్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సెట్స్ పైకి వెళ్ళింది. పవర్ స్టార్ దాదాపను 10 రోజులు సినిమా షూటింగ్ కు ఇచ్చేశాడట. దాంతో హరీష్ శంకర్రంగంలోకి దిగిపోయాడు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైనట్లు సింబాలిక్ గా చెప్పాడు హరీష్.  ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈనాడే ఎదురౌతుంటే” అనే సాంగ్ ని పోస్ట్ చేశాడు. దాని కింద ఉస్తాద్ భగత్ సింగ్అని పెట్టాడు.  

ఈ మూవీ షూటింగ్ ఏప్రిల్ 5 నుంచి స్టార్ట్ అవుతుందంటూ ఫస్ట్ నుంచీ వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్తలే నిజం అయ్యాయి. ఇక తమిళ సినిమా తేరి కి రీమేక్ గా ఈసినిమా రూపొందుతున్నట్టు తెలుస్తుంది.ఈమూవీమేజర్ షూటింగ్ కంప్లీట్ చేసి.. పవర్ స్టార్.. నెక్ట్స్ హరిహరవీరమల్లు సినిమాను కంప్లీట్ చేయబోతున్నాడు. ఇక ఉస్తాద్ కోసం స్పెషల్ గా లుక్ ను కూడామార్చుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

PREV
Read more Articles on
click me!

Recommended Stories

నమ్రత ఎంత చెప్పినా వినకుండా డిజాస్టర్ చూసిన మహేష్ బాబు ? ఆ సినిమా చేసి తప్పు చేశాడా?
Eesha Rebba: డైరెక్టర్‌ని పెళ్లి చేసుకోబోతున్న ఈషా రెబ్బా.. అసలు కథ ఇప్పుడే స్టార్ట్