ఆసక్తికరంగా మిషన్: చాప్ట‌ర్ 1 టీజ‌ర్‌.. అదరగొట్టిన అరుణ్ విజయ్..

Published : Apr 05, 2023, 09:32 PM IST
ఆసక్తికరంగా మిషన్: చాప్ట‌ర్ 1 టీజ‌ర్‌.. అదరగొట్టిన అరుణ్ విజయ్..

సారాంశం

అరుణ్ విజయ్ హీరోగా..  భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా  మిషన్:  చాప్ట‌ర్ 1. ఫియర్‌లెస్ జ‌ర్నీ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది మూవీ. ఈసినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్ ఆడియన్స్ లో అంచనాలు పెంచుతోంది. 

కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్  హీరోగా.. యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ... విజ‌య్ ద‌ర్శ‌క‌త్వంలో  ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మించిన సినిమా మిషన్:  చాప్ట‌ర్ 1. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి   టీజర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది, వ‌రుస విజ‌యాల‌ను అందుకుంటూ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు లైకా ప్రొడక్ష‌న్స్. భారీ బ‌డ్జెట్  చిత్రాల‌ను రూపొందిస్తూ.. మంచిమంచి సినిమాలను.. డిఫరెంట్ కాన్సెప్ట్ లను ప్రేక్షకులకు అందిస్తున్నారు. వైవిధ్య‌మైన, ఎవ‌రూ రూపొందించ‌ని, ప్రేక్ష‌కుల‌ను క‌ట్టిప‌డేసే క‌థాంశాలున్న సినిమాల‌కు  అందడా నిలుస్తోంది లైకా.. ప్రస్తుతం లైకా నుంచి అలాంటి సినిమానే రాబోతోంది. భారీ బ‌డ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా  మిషన్:  చాప్ట‌ర్ 1. ఫియర్‌లెస్ జ‌ర్నీ ట్యాగ్ లైన్ తో తెరకెక్కుతోంది మూవీ. 

మిషన్: చాప్ట‌ర్ 1 టీజర్ విశేషంగా ఆకట్టుకుంటుంది.   లండ‌న్‌లోని 'వాండ్స్ వ‌ర్త్'  జైలు బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా  న‌డుస్తుంద‌ని అర్థ‌మ‌వుతుంది. ప్ర‌పంచంలోని ఖైదీలంద‌రూ ఆ జైలులో ఉంటారు. ఆ జైలును సంర‌క్షించే ఆఫీస‌ర్ పాత్ర‌లో ఎమీ జాక్స‌న్ న‌టిస్తుంది. ఇక ఆ జైలులో ఓ ఖైదీగా హీరో అరుణ్ విజ‌య్ కనిపిస్తాడు. ఫ్యామిలీతో  ఇండియా నుంచి లండ‌న్ వ‌చ్చిన అరుణ్ విజ‌య్‌ని అక్క‌డి పోలీసులు అరెస్ట్ చేస్తారు. త‌న కుమార్తెకు మ‌రో రెండు రోజుల్లో ఆప‌రేష‌న్ ఉంటుంది. త‌నేమో జైలులో ఉంటాడు. అస‌లేం జరిగింది? అందుకు కారణాలు ఏమిటి? అనేదే కథ. 

 

అద్భుతమైన స‌న్నివేశాలు, ఆక‌ట్టుకునే యాక్ష‌న్ స‌న్నివేశాల‌తో మిషన్: చాప్ట‌ర్ 1 టీజ‌ర్ ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. . జి.వి.ప్ర‌కాష్ కుమార్ బీజీఎం సినిమాకు మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంద‌న‌టంలో డౌటేలేద‌ని టీజ‌ర్ చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. డైరెక్ట‌ర్ విజ‌య్ త‌న‌దైన ప్లానింగ్‌తో ఇంత భారీ బ‌డ్జెట్ చిత్రాన్ని 70 రోజుల్లోనే పూర్తి చేశారు. హీరో అరుణ్ విజ‌య్ రిస్కీ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో డూప్ లేకుండా న‌టించారు. స్టంట్ సిల్వ ఈ చిత్రానికి యాక్ష‌న్ కొరియోగ్ర‌ఫీ అందించారు. ఆయ‌న యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కుల‌ను మెప్పించేలా ఉన్నాయి. 


 

PREV
click me!

Recommended Stories

20 ఏళ్లుగా స్టార్ డమ్ కోసం ఎదురుచూసి.. తెలుగులో కనిపించకుండా పోయిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Bigg Boss 9 Telugu: షాకింగ్ ట్విస్ట్... ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ విన్నర్ రేసులోకి..