
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బ్యూటీ క్వీన్ సమంత హీరోయిన్ గా నటించిన విలేజ్ యాక్షన్ డ్రామా మూవీ రంగస్థలం. సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈసినిమా టాలీవుడ్ లో ఎన్నో రికార్డ్స్ ను తిరగరాసింది. ఈ సినిమా నాన్ బాహుబలి క్యాటగిరిలో ఇండస్ట్రీ హిట్టుగా నిలిచింది. 2018 లో రిలీజ్ అయిన ఈ మూవీ 216 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సంచనలం సృష్టించింది. అప్పటి వరకూ రామ్ చరణ్ పై ఉన్న కాస్తో కూస్తో నెగెటివిటీని.. ఈసినిమా దూరం చేసింది.. రామ్ చరణ్ లోని కంప్లీట్ యాక్టర్ బయట పెట్టి... సరికొత్త పవర్ స్టార్ ను.. ఈ సినిమా ఆడియన్స్ కి పరిచయం చేసింది.
ఇక తాజాగా ఈ సినిమా ఇప్పుడు జపాన్ లో రిలీజ్ అయ్యింది. మగధీర సినిమాతో జపాన్ లో రామ్ చరణ్ కి మంచి ఫ్యాన్ బేస్ క్రియేట్ అయ్యింది. అసలు ఇండియన్ సినిమాలకు జపాన్ లో డిమాండ్ ఎక్కువ. మార్కెట్ కూడా ఎక్కువగా ఉంటుంది. మొదట్లో రజనీకాంత్ సినిమాలకు ఫ్యాన్స్ ఎక్కువగా ఉండేవారు. రజనీకి అభిమాన సంఘాలు కూడా ఉన్నాయిన అక్కడ. రజనీకాంత్ సినిమాల రికార్డ్స్ ను ప్రభాస్ బాహుబలి జపాన్ లో బ్రేక్ చేసింది. దాని తరువాత వరుసగా సినిమాలు రికార్డ్స్ ను తిరిగరాస్తూ వస్తున్నాయి. ఈమధ్యనే ఆర్ఆర్ఆర్ మూవీ రజనీ పేరు మీద ఉన్న అన్ని రికార్డ్స్ ను తుడిచిపెట్టేసింది. ప్రభాస్ కు జపాన్ లో డైహార్ట్ ఫ్యాన్స్ ఉండగా.. ఆర్ఆర్ఆర్ తో రామ్ చరణ్ కు, ఎన్టీఆర్ కు కూడా అలాంటి ఫ్యాన్ బేస్ ఏర్పడింది జపాన్ లో.
RRR తో చరణ్ ఫాలోయింగ్ జపాన్ లో మరింత పెరిగింది. దీంతో సూపర్ హిట్ మూవీ రంగస్థలంని రిలీజ్ చేయాలంటూ డిమాండ్ రావడంతో.. నిన్న (జులై 14) జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద రంగస్థలం రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో పాటు ఇండియన్ బ్లాక్ బస్టర్ KGF 1, KGF 2 చిత్రాలు కూడా రిలీజ్ అయ్యాయి. అయితే జపాన్ బాక్స్ ఆఫీస్ వద్ద యశ్ కంటే చిట్టిబాబు డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది. కేవలం అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రంగస్థలం 2.5 మిలియన్ యాన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది.
జపాన్ లో తెలుగు హీరోలకు డిమాండ్ ఎక్కువగా ఉండగా.. తమిళ హీరో సూర్య, కార్తీలతో పాటు.. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ కు కూడా భారీగా మార్కెట్ ఉంది. త్వరలో షారుఖ్ పఠాన్ సినిమాను కూడా అక్కడ రిలీజ్ చేసే ఏర్పాట్లు చేస్తున్నారు మేకర్స్. ఇలా జపాన్ బాక్సాఫీస్ దగ్గర మన ఇండియన్ సినిమాలు దండయాత్రలు చేస్తున్నాయి. రాను రాను మన హీరోలకు అక్కడ భారీగా మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. డైరెక్ట్ రిలీజ్ అయినా ఆశ్చర్య పడనక్కర్లేదు.