
ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వెలిగిన కస్తూరి ఇప్పుడు ప్రశాంతంగా టీవి సీరియల్స్ చేసుకుంటోంది. అయితే ఖాళీ ఉన్నప్పుడల్లా సోషల్ మీడియా ని అడ్డం పెట్టి ఎవరో ఒకరిని కెలికే పోగ్రాం పెట్టుకుంటుంది. రీసెంట్ గా ప్రభాస్ ఆదిపురుష్ సినిమా మీద కూడా కామెంట్స్ చేసి ప్రభాస్ అభిమానుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంది. తాజా మరో వివాదంలోకి అడుగుపెట్టింది కస్తూరి. ఇద్దరు అమ్మాయిలు గురించి ఓ వీడియో షేర్ చేసింది కస్తూరి. ఆ వీడియో మరోసారి విమర్శలు పాలు చేసింది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది. మీరే చూడండి.
ఈ వీడియోలో ఇద్దరు అమ్మాయిలు మద్యం దుకాణానికి వెళ్లి మద్యం కొంటున్నారు. 'బాగా తాగండి అమ్మాయిలు' అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఇది వాట్సాప్ ఫార్వర్డ్‌లోని వీడియో అని చెప్పింది. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. అనేక మంది నటిపై విమర్శలు గుప్పించారు. ఇది ఆ అమ్మాయిల వ్యక్తిగత విషయం అని, దీన్ని ఎందుకు షేర్ చేశారని ప్రశ్నిస్తున్నారు.
మరో ప్రక్క గాయని చిన్మయి(Singer Chinmayi) సైతం ఈ వీడియోపై స్పందించింది. 'నిజాయితీగా చెప్పాలంటే ఇలాంటి వీడియో షేర్ చేయాల్సిన అవసరం లేదు' అంటూ కస్తూరిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నెటిజన్లు కూడా చిన్మయికి మద్దతుగా కామెంట్స్ చేస్తున్నారు.
కస్తూరిని టార్గెట్ చేస్తూ మీ పోస్ట్ చాలా మందిని తప్పుదారి పట్టించేలా ఉంది' అని చాలా మంది అంటున్నారు. అసలు అమ్మాయిలు మందు తాగడాన్ని ఎంకరేజ్ చేస్తున్నావా? వ్యతిరేకిస్తున్నావా అని మరి కొందరుప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అమ్మాయిలు మందు తాగొద్దని, ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నారు. అదే సెలబ్రెటీల ఇళ్లలో మందు తాగితే.. షేర్ చేసే దమ్ము ఉందా కస్తూరి అంటున్నారు నెటిజన్లు. ఇలా ఈ విషయమై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.