Ram Charan: హీరో సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు!

Published : Jan 18, 2022, 04:11 PM IST
Ram Charan: హీరో సినిమాపై రామ్ చరణ్ ప్రశంసలు!

సారాంశం

మొదటి చిత్రంతోనే అశోక్ గల్లా ఆకట్టుకున్నాడన్న మాట వినిపిస్తుంది. మాస్ అంశాలు జోడించి భారీ బడ్జెట్ తో హీరో చిత్రం తెరకెక్కింది. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో మూవీపై స్పందించారు. హీరో సినిమా చూశానంటూ ట్వీట్ చేశారు.

సూపర్ కృష్ణ మనవడు, మహేష్ మేనల్లుడు అశోక్ గల్లా (Ashok Galla) 'హీరో' చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదలైన హీరో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. మొదటి చిత్రంతోనే అశోక్ గల్లా ఆకట్టుకున్నాడన్న మాట వినిపిస్తుంది. మాస్ అంశాలు జోడించి భారీ బడ్జెట్ తో హీరో చిత్రం తెరకెక్కింది. కాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరో మూవీపై స్పందించారు. హీరో సినిమా చూశానంటూ ట్వీట్ చేశారు. 

రామ్ చరణ్ తన ట్వీట్ లో... సినిమా ప్రపంచంలోకి హీరో(Ram Charan) చిత్రంతో అశోక్ గల్లా అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు. ఆద్యంతం సినిమాను ఎంజాయ్ చేశాను. అశోక్ గల్లా, జయదేవ్ గల్లా, పద్మావతి గారితో పాటు దర్శకుడు శ్రీరామ్ ఆదిత్యకు, హీరో సినిమా టీమ్ సభ్యులకు కంగ్రాట్స్. భవిష్యత్ లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను... అన్నారు. హీరో సినిమాకు మద్దతుగా రామ్ చరణ్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

హీరో మూవీ అశోక్ గల్లా సొంత బ్యానర్ లో తెరకెక్కింది. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించారు. ఇక మహేష్ (Mahesh babu)కు అత్యంత మిత్రుడైన చరణ్ హీరో మూవీ ప్రమోషన్స్ లో  పాల్గొనడం విశేషం. హీరో మూవీ ప్రీ రిలీజ్ వేడుకకు చరణ్ ముఖ్య అతిథిగా రావాల్సి ఉంది. అనుకోని కారణాల వలన ఆయన హాజరు కాలేదు. అయితే సోషల్ మీడియా వేదికగా బెస్ట్ విషెస్ తెలియజేశారు. తాజాగా హీరో సినిమా బాగుందంటూ తనదైన శైలిలో మద్దతు ప్రకటించారు. హీరో మూవీ పూజా కార్యక్రమానికి రామ్ చరణ్ ముఖ్య అతిథిగా హాజరై అశోక్, నిధిపై క్లాప్ కొట్టారు. ఇక రామ్ చరణ్ తన సినిమా పట్ల స్పందించడం పై అశోక్ గల్లా సంతోషం వ్యక్తం చేశాడు. మీరు మా సినిమాను ఇష్టపడినందుకు ధన్యవాదాలు అన్న.. అంటూ కృతఙ్ఞతలు తెలిపారు.

కృష్ణ కుటుంబంలో రమేష్ బాబు మరణంతో విషాదం చోటు చేసుకుంది. దీంతో పూర్తి స్థాయిలో హీరో చిత్రాన్ని ప్రమోట్ చేయలేకపోయారు. మహేష్ కి కరోనా సోకడం కూడా ఒక కారణం. వరుసగా చోటు చేసుకున్న అనివార్య కారణాల వలన హీరో మూవీకి మహేష్ సరైన న్యాయం చేయలేకపోయారు. అప్పటికీ ఓ వీడియో బైట్ విడుదల చేయడం ద్వారా హీరో సినిమా చూడాలంటూ తన అభిమానులకు సందేశం పంపారు. 

PREV
click me!

Recommended Stories

OTT: ఒకే రాత్రి 3 హ‌త్య‌లు, ఊహ‌కంద‌ని ట్విస్టులు, ప్ర‌తీ సీన్ క్లైమాక్సే.. ఓటీటీలో సూప‌ర్ థ్రిల్ల‌ర్
Gunde Ninda Gudi Gantalu Today డిసెంబర్ 11 ఎపిసోడ్ : మీనాని ఏడిపించేసిన అత్త, ప్రభావతి కి లెఫ్ట్ రైట్ వాయించిన శ్రుతి