
భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలతో వరస సక్సెస్ లను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ బాబు.. రెండేళ్ల గ్యాప్ తర్వాత తాజాగా ‘సర్కారు వారి పాట’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గీత గోవిందం సినిమాతో రొమాంటిక్ బ్లాక్ బస్టర్ అందుకున్న పరశురాం ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచి ఈ చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. పోస్టర్లు, టీజర్, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి..హైప్ ని రెట్టింపు చేసాయి. దానికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘సర్కారు వారి పాట’పై హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రానికి టాక్ పరంగా యావరేజ్ వచ్చినా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తోంది. తాజాగా నైజాం లో ఈ సినిమా ఫస్ట్ డే వసూళ్ల వివరాలు బయటకి వచ్చాయి.
పి ఆర్ నంబర్లు ప్రకారం ఈ చిత్రంనాన్ RRR ఓపెనింగ్స్ సెట్ చేసి రికార్డు లెవెల్లో 12.24 కోట్ల షేర్ ని రాబట్టింది. ఈ స్పీడు చూస్తుంటే మహేష్ ఈ వీకెండ్ లో భాక్సాఫీస్ దగ్గర కుమ్మేయటం గ్యారెంటీ అని చెప్పాలి.
చాలా కాలంగా బ్యాంకుల్లో అప్పు తీర్చలేక చాలా మంది సామాన్యులు సూసైడ్స్ చేసుకుంటున్నారు. కానీ కొంతమంది బడా బిజినెస్ మ్యాన్ లు మాత్రం బ్యాంకుల్లో వేల కోట్లు అప్పును ఎగగొట్టి, సమాజంలో యథేచ్ఛగా తిరుగుతున్నారు. అలాంటి వారి ప్రభావం బ్యాంకులపై ఎలా ఉంటుందనే విషయాన్ని కథగా తీసుకొని సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు పరశురాం. ఓ మంచి సోషల్ మెజేస్ ఉన్న పాయింట్‌ని ఎంచుకున్న దర్శకుడు.. దానికి కమర్షియల్ హంగులను జతపర్చి యూత్‌ని అట్రాక్ట్ చేసే ప్రయత్నం చేశాడు.
మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే దర్శకుడు పరశురామ్ పెట్ల ఈ సినిమాని తెరకెక్కించగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ వారు సంయుక్తంగా ఈ బిగ్ ఎంటర్టైనర్ ని నిర్మాణం వహించారు.