ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ఇండియా టుడే... ఆర్ ఆర్ ఆర్ స్టార్ అంటూ చరణ్ ఫోటో!

Published : Mar 30, 2023, 10:48 AM ISTUpdated : Mar 30, 2023, 11:10 AM IST
ఎన్టీఆర్ కి షాక్ ఇచ్చిన ఇండియా టుడే... ఆర్ ఆర్ ఆర్ స్టార్ అంటూ చరణ్ ఫోటో!

సారాంశం

ఆర్ ఆర్ ఆర్ మూవీ ఎన్టీఆర్ కంటే చరణ్ కి బాగా ప్లస్ అయినట్లు తెలుస్తుంది. తాజాగా ఎన్టీఆర్ కి చరణ్ మరో షాక్ ఇచ్చాడు. ఇండియా టుడే కవర్ పేజ్ పై చరణ్ దర్శనమిచ్చారు.   

ఆర్ ఆర్ ఆర్ విడుదల నాటి నుండి ఎన్టీఆర్-రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ఆధిపత్యపోరు నడుస్తుంది. ఆర్ ఆర్ ఆర్ మూవీలో ఎవరు బాగా చేశారు? ఏ హీరో రోల్ హైలెట్? అంటూ పోలికలు, సమీకరణాలు మొదలయ్యాయి. అభిమానులు మేము గొప్పంటే మేము గొప్పంటూ కొంటుకుంటున్నారు. ఏడాది కాలంగా ఈ తంతు నడుస్తుంది. ఇక ఆస్కార్ వేడుక కోసం రామ్ చరణ్ అమెరికా వెళ్లారు. తారకరత్న మరణం నేపథ్యంలో ఎన్టీఆర్ ఆలస్యంగా వెళ్లారు. 

దీంతో ఎన్టీఆర్ లేకుండానే పలు ఈవెంట్స్ లో రామ్ చరణ్, రాజమౌళి పాల్గొన్నారు. రామ్ చరణ్ కి కొన్ని ప్రత్యేక గౌరవాలు దక్కాయి. ఆయనకు గుడ్ మార్నింగ్ అమెరికా షోకి ఆహ్వానం లభించింది. ఈ ఘనత అందుకున్న మొదటి ఇండియన్ హీరోగా రామ్ చరణ్ రికార్డులకు ఎక్కారు. అలాగే హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్ కి అతిథిగా హాజరయ్యారు. స్పాట్ లైట్ అవార్డుతో సత్కరించబడ్డారు. అమెరికన్ మీడియా ఇంటర్వ్యూల్లో పాల్గొన్నారు. 

అక్కడి రామ్ చరణ్ విజయాలను ఇండియన్ మీడియా ప్రముఖంగా కవర్ చేసింది. ఇదంతా ఎన్టీఆర్ అభిమానుల్లో అసహనానికి కారణమైంది. చివరికి హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ని మా వాడికి అవార్డు లేదా అని ప్రశ్నిస్తూ ట్వీట్స్ వేశారు. దాంతో హెచ్ సీ ఏ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. కొన్ని పరిణామాలు రామ్ చరణ్ కి అనుకూలించాయి. అదే సమయంలో ఎన్టీఆర్ కి ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయి. సినిమాలో క్యారెక్టర్స్, నటనకు మించి ఆస్కార్ క్యాంపైన్ లో జరిగిన సంఘటనలు ఎన్టీఆర్ ని వెనక్కి నెట్టి చరణ్ ని హైలెట్ చేశాయి. 

మీడియా దృష్టి ఫోకస్ లో ఉన్న వాళ్ళ మీద ఉంటుంది... కాబట్టి చరణ్ కి అడ్వాటేంజ్ అయ్యింది. దానికి తాజా ఉదంతం నిదర్శనం. ప్రముఖ మీడియా సంస్థ ఇండియా టుడే కవర్ పేజ్ మీద రామ్ చరణ్ ఫోటో ముద్రించి విడుదల చేసింది. 'ఆర్ ఆర్ ఆర్ స్టార్ రామ్ చరణ్'. ది రోర్ ఆఫ్ రామ్' అంటూ క్యాప్షన్స్ ఇచ్చి ఎలివేట్ చేసింది. ఇండియా టుడే ఆర్ ఆర్ ఆర్ మూవీ క్రెడిట్ ఒక్క రామ్ చరణ్ కే ఇచ్చినట్లు అయ్యింది. ఇండియా టుడే కవర్ పేజ్ మీద తన ఫోటో ప్రచురించడం పై రామ్ చరణ్ సంతోషం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో సదరు కవర్ ఫోటో పోస్ట్ చేశారు. ఎన్టీఆర్ అభిమానుల్లో ఇది మంట పుట్టిస్తుంది. 

కాగా మార్చి 27న రాత్రి చిరంజీవి నివాసంలో జరిగిన చరణ్ బర్త్ డే వేడుకలకు ఎన్టీఆర్ హాజరు కాలేదు. సోషల్ మీడియాలో విషెస్ చెప్పి ఊరుకున్నారు. ఈ క్రమంలో రామ్ చరణ్-ఎన్టీఆర్ మధ్య సత్సంబంధాలు లేవని, ఈ మధ్య జరిగిన కొన్ని పరిణామాలతో చెడిందని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియదు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?