
`ఆర్‌ఆర్‌ఆర్` `దోస్తీ` సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఎంట్రీ గూస్‌బమ్స్ తెప్పిస్తుందంటూ ఇరు హీరోల అభిమానులు కామెంట్లతో రెచ్చిపోతున్నారు. ఫ్రెండ్‌షిప్ డే సందర్భంగా విడుదల చేసిన `దోస్తీ` పాటని ఐదు భాషల్లో తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళంలో ఐదుగురు సింగర్లతో పాడించారు. తెలుగు వెర్షన్ పాటని హేమచంద్ర పాడారు. అయితే ఇప్పుడు ఇదే పలు విమర్శలకు తావిస్తుంది. మిగిలిన అన్ని భాషల సింగర్లు చాలా బేస్ వాయిస్‌తో అద్భుతంగా పాడారని, కానీ తెలుగు వెర్షన్ సాంగ్‌లో మాత్రం ఆ బేస్ మిస్ అయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
`ఆర్‌ఆర్‌ఆర్` సినిమా అంటే ఇండియా వైడ్‌గా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం. ఎన్టీఆర్, రామ్‌చరణ్ వంటి సూపర్‌స్టార్స్ నటిస్తుండటం, రాజమౌళి రూపొందిస్తున్న సినిమా కావడం, పైగా ఇండియా వైడ్‌గా దాదాపు పది భాషల్లో ఈ సినిమా రిలీజ్ కాబోతుండటంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో హేమచంద్ర పాడిన పాట ఆ స్థాయిని అందుకోలేదనే టాక్ వినిపిస్తుంది. అదే సమయంలో దోస్త్ సాంగ్‌లో హీరోలను ప్రధానంగా చూపించాల్సిందని, కానీ సింగర్లని, హైలైట్ చేశారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
దోస్తీ అంటూ ఇద్దరు హీరోల మధ్య స్నేహాన్ని ఆవిష్కరించేలా పాట ఆసాంతం సాగాలని, కానీ చివర్లో మాత్రమే ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లను చూపించడం తమని అసంతృప్తికి గురి చేసిందని ఇద్దరు హీరోల అభిమానుల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ పాట ప్రమోషనల్ సాంగ్ అయినప్పటికీ హీరోలను హైలైట్‌గా చూపించి ఉంటే ఇంకా బాగుండేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. బహుశా అదే కారణంతో పాటకి వ్యూస్ కూడా ఊహించని విధంగా రావడం లేదని అంటున్నారు క్రిటిక్స్. మరి దీన్ని జక్కన్న టీమ్ ఎలా తీసుకుంటుందో చూడాలి.
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న `ఆర్‌ఆర్‌ఆర్` సినిమాని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. దాదాపు నాలుగు వందల కోట్ల బడ్జెట్‌తో సినిమా రూపొందుతుంది. ఇందులో చరణ్ సరసన అలియా భట్, ఎన్టీఆర్ సరసన బ్రిటీష్ నటి ఒలివియా మోర్రీస్ నటిస్తుంది. అజయ్ దేవగన్, శ్రియా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా టాకీ చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఓ సాంగ్ పెండింగ్‌లో ఉంది. దీంతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది. ఇక అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి దసరా కానుకగా అక్టోబర్ 13న సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.