సమంత ఆ పని ఎందుకు చేసింది... నేషనల్ వైడ్ హాట్ టాపిక్ ఇదే!

Published : Aug 01, 2021, 02:55 PM IST
సమంత ఆ పని ఎందుకు చేసింది... నేషనల్ వైడ్ హాట్ టాపిక్ ఇదే!

సారాంశం

సమంత తన పేరును ఎందుకు మార్చారని ఆమె ఫ్యాన్స్, నెటిజెన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. దీనితో  సమంత పేరు సోషల్ మాధ్యమాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది.   

సోషల్ మీడియాలో పేరు మార్చుకొని పెద్ద చర్చకు తెరలేపింది సమంత. తన అధికారిక సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ అయిన ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ లో సమంత అక్కినేని పేరును కాస్తా జస్ట్ 's' మార్చేసింది. సమంత తన పేరును ఎందుకు మార్చారని ఆమె ఫ్యాన్స్, నెటిజెన్స్ ఆరా తీయడం మొదలుపెట్టారు. దీనితో  సమంత పేరు సోషల్ మాధ్యమాల్లో నేషనల్ వైడ్ ట్రెండ్ అయ్యింది. 


సమంత అక్కినేని అనే పేరుకు బదులు ఎస్ అనే లెటర్ వాడడానికి కారణం ఇదే అంటూ కొన్ని తీరీలు తెరపైకి వచ్చాయి. అందులో మొదటిది.. సమంత నటిస్తున్న ప్రస్తుత చిత్రం శాకుంతలం టైటిల్ మొదటి లెటర్ ఎస్ అవుతుంది. దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీ షూటింగ్ జరుపుకుంటుండగా.. ఆ సినిమా టైటిల్ లోని మొదటి అక్షరాన్ని ఉద్దేశిస్తూ సమంత, అలా పేరు మార్చుకున్నారని కొందరు అంటున్నారు. 


అలాగే సమంత పేరులోని మొదటి అక్షరం కూడా ఎస్ కావడంతో తన పేరును అలా షార్ట్ గా పెట్టుకొన్నారని మరి కొందరు అంటున్నారు. ఇక కొంచెం నెగిటివ్ యాటిట్యూడ్ కలిగిన నెటిజెన్స్ ఇది ఖచ్చితంగా చైతూ పై కోపమే అని వాదిస్తున్నారు. చైతూ కుటుంబంపై కోపంతోనే సమంత పేరు నుండి అక్కినేని తొలగించి, జస్ట్ లెటర్ ఎస్ వాడుతున్నారని అంటున్నారు. నేషనల్ వైడ్ హాట్ టాపిక్ గా మారిన ఈ విషయం వెనుక అసలు కారణం ఏమిటో, సమంతకే తెలియాలి. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: చివరి రోజు ఓటింగ్‌ తలక్రిందులు, పక్కా ప్లాన్‌ ప్రకారమే.. టాప్‌లో ఉన్నదెవరంటే?
Karthika Deepam 2 Today Episode: దీప, కార్తీక్ లపై రెచ్చిపోయిన పారు, జ్యో- శ్రీధర్ పదవి పోయినట్లేనా?