నర్తనా.. బుచ్చిబాబా.. రాంచరణ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రేపే ?

Published : Nov 27, 2022, 04:24 PM IST
నర్తనా.. బుచ్చిబాబా.. రాంచరణ్ కొత్త సినిమా అనౌన్స్మెంట్ రేపే ?

సారాంశం

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరిగింది. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి.

మెగా పవర్ స్టార్ రాంచరణ్ ప్రస్తుతం దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఇటీవల ఈ చిత్ర షూటింగ్ న్యూజిలాండ్ లో జరిగింది. వచ్చే ఏడాది రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు జరుగుతున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాంచరణ్ చేస్తున్న చిత్రాలపై ఇండియా మొత్తం ఆసక్తి నెలకొంది. 

తనపై నెలకొన్న అంచనాలకు తగ్గట్లుగానే చరణ్ కూడా ఆచి తూచి అడుగులు వేస్తున్నాడు. శంకర్ మూవీ తర్వాత రాంచరణ్ చేయబోయే చిత్రం గురించి అనేక రకాలుగా వార్తలు వస్తున్నాయి. గతంలో గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో చరణ్ ఒక చిత్రాన్ని ప్రకటించాడు. కానీ సెకండ్ హాఫ్ కథ నచ్చక పోవడంతో ఆ మూవీ పక్కకి వెళ్లినట్లు తెలుస్తోంది. 

ఇంతలో తమిళ క్రేజీ దర్శకుడు నర్తన్.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు లాంటి దర్శకుల పేర్లు వినిపించాయి. ప్రస్తుతం రాంచరణ్ నర్తన్, బుచ్చిబాబు ఇద్దరితో సినిమా చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. 

రేపు సోమవారం రోజు ఉదయం 11:11 గంటలకు రాంచరణ్ కొత్త సినిమా ప్రకటన ఉండబోతున్నట్లు తెలుస్తోంది. బుచ్చిబాబు, రాంచరణ్ కాంబోలో చిత్రం దాదాపుగా ఖాయం అంటూ వార్తలు వస్తున్నాయి. బుచ్చిబాబు ముందుగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా చేసేందుకు ప్రకటించారు. అయితే ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్స్ ఆలస్యం అవుతుండడంతో రాంచరణ్ కి కథ వినిపించి ఓకె చేయించుకున్నట్లు తెలుస్తోంది. 

ఏది ఏమైనా మెగా పవర్ స్టార్ కొత్త చిత్రం ఏ దర్శకుడితో అనేది సోమవారం తేలనుంది. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ సి15లో రాంచరణ్ కి జోడిగా కియారా అద్వానీ నటిస్తోంది. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో రాంచరణ్ తండ్రి కొడుకులుగా డ్యూయెల్ రోల్ లో కనిపించనున్నారు.  

PREV
click me!

Recommended Stories

Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే
Divi Vadthya: లవ్ బ్రేకప్‌తో డిప్రెషన్‌లోకి వెళ్లా, మళ్లీ ఆ కష్టాలు రావద్దు.. నటి దివి వద్త్య ఎమోషనల్‌