పవిత్రా లోకేష్‌ ఫిర్యాదుపై దర్యాప్తు ముమ్మరం.... ఈ 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కి నోటీసులు

By Siva KodatiFirst Published Nov 27, 2022, 3:47 PM IST
Highlights

సినీ నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. దీనిపై ముమ్మరంగా దర్యాప్తు జరుపుతోన్న పోలీసులు.. 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేశారు. 

తాను, నరేశ్‌లకు చెందిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సినీ నటి పవిత్రా లోకేష్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేశారు. మూడ్రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని ఆ సైట్ల నిర్వాహకులను ఆదేశించారు. 

ఇకపోతే...  కన్నడ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ప్రేక్షకులను అలరించారు పవిత్రా లోకేష్. సెకండ్ ఇన్నింగ్స్ లో కన్నడ, మలయాళం, తెలుగు చిత్రాల్లోనూ నటిస్తూ కేరీర్ లో ఫుల్ బిజీగా ఉంది.  అమ్మ, అత్త, తదితర కీలక పాత్రలను పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది పవిత్రా. అటు కన్నడతో పాటు ఇటు టాలీవుడ్ లో నూ వందకు పైగా చిత్రాల్లో నటించి పాపులారిటీని దక్కించుకుంది. ఇటీవల నటుడు నరేష్ తో లైఫ్ షేర్ చేసుకోవడంతో మరింతగా తెలుగు ప్రజలకు పరిచయం అయ్యింది. కొద్దిరోజుల కింద నరేష్ - పవిత్రా లోకేష్ పెళ్లి మేటర్ తో నెట్టింట హాట్ టాపిక్ గా మారారు. ఇంకా ఇష్యూ కొనసాగుతున్నప్పటికీ నరేష్ - పవిత్రా మాత్రం  కలిసే ఉంటున్నారు. సహజీవనం చేస్తూ కొత్త లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో వీరి బంధంపై రోజుకో కొత్త అంశం బయటికి వస్తోంది.

ALso REad:మాపై మార్ఫింగ్ ఫోటోలు, అభ్యంతర వ్యాఖ్యలతో దుష్ప్రచారం : ఆ సైట్లు, ఛానెల్స్‌పై పవిత్రా లోకేష్ ఫిర్యాదు

కాగా... దివంగత సూపర్‌స్టార్ కృష్ణను ఆఖరి చూపు చూసేందుకు వచ్చిన వారికి నరేశ్ చిరాకు తెప్పించే పనులు చేసినట్టు ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. కృష్ణ చనిపోయిన సమయంలో నరేశ్ అక్కడికి వచ్చిన వచ్చిన సెలబ్రెటీలతో ప్రవర్తించిన తీరుపై విమర్శలు వెల్లువెతున్నాయి. ఓ దర్శకుడు, నిర్మాత చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.అంతా కృష్ణ చనిపోయిన బాధలో ఉంటే.. నరేశ్ మాత్రం అదేదో ఫంక్షన్ లాగా వచ్చిన ప్రతి ఒక్కరినీ ఎదురెళ్లి స్వాగతించడం నచ్చలేదంటున్నారు. హుందాగా వ్యవహరించకపోవడంతో పాటు విషాద సమయంలో హడావుడిగా నడుచుకోవడం పట్ల అందరూ మండిపడుతున్నారు. ఆయన ప్రవర్తనపై కుటుంబీకులకూ నచ్చలేదని తెలుస్తోంది. 

మరోవైపు నటి పవిత్రని కూడా అక్కడే కుటుంబ సభ్యులతో కలిపి కూర్చోబెట్టడం కూడా ఎవ్వరికీ నచ్చలేదని అంటున్నారు.అదీగాక విషాద ఘటనతో బాధపడుతున్న కొందరికీ ఆమెను పరిచయం చేయడం మరింత ఎబ్బెట్టుగా అనిపించిందంటూ పలువురు మండిపడుతున్నారు. ఇక మొన్నటి నుంచి నరేశ్ అమర్యాదగా  సీఎం కేసీఆర్ వైపు చేయి చూపించడంతో వెంటనే బుద్ధి చెప్పిన ఓ వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతూనే ఉంది. దివంగత నటి విజయ నిర్మల చనిపోయినప్పుడు కూడా నరేశ్ చేష్ఠలు సినీ పెద్దలకు కోపం తెప్పించాయని, ఇప్పుడూ మళ్లీ అదే ప్రవర్తన కలిగి ఉండటం పట్ల ఇండస్ట్రీలోని ప్రముఖులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాస్తా హుందాగా ఉంటే బాగుండని అభిప్రాయపడుతున్నారు. 
 

click me!