
టాలీవుడ్ లో రీరిలీజ్ ల ట్రెండ్ విపరీతంగా నడుస్తోంది. స్టార్ హీరో అయ్యుంటే చాలు.. ఆయనకు సబంధించిన ఏదో ఒక అకేషన్ ను సెలబ్రేట్ చేస్తూ.. పాత సినిమాలను రీరిలీజ్ చేసి మంచి కలెక్షన్స్ సాధిస్తున్నారు. ముఖ్యంగా మెగా ప్యామిలీ నుంచి చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా రీరిలీజ్ లు అవుతుండగా.. అటు ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు సినిమాలు కూడా రిరిలీజ్ అయ్యాయి.. అవుతున్నాయి కూడా. ఇండస్ట్రీలో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి నుంచి కొత్త సినిమాల విడుదల కంటే రీ రిలీజ్ సందడే ఎక్కువుగా కనిపిస్తుంది. హిట్ సినిమా, ప్లాప్ సినిమా అని తేడా లేకుండా మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకు వచ్చి ఎంజాయ్ చేసేస్తున్నారు ప్రేక్షకులు.
కేవలం టాలీవుడ్ హీరోల సినిమాలు మాత్రమే కాదు తమిళ స్టార్ హీరోల సినిమాలు కూడా అక్కడ.. ఇక్కడ రెండు భాషల్లో అదిరిపోయే కలెక్షన్స్ అందిస్తూ తెలుగు ప్రేక్షకులు రీ రిలీజ్స్ ని ఓ రేంజ్ లో ఆదరిస్తున్నారు. దీంతో పలువురు డిస్ట్రిబ్యూటర్స్ మరికొన్ని సినిమాలను ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. ఈక్రమంలో వారు మంచి అకేషన్లను వెతుక్కుంటున్నారు. ఈక్రమంలో మరోసారి రామ్ చరణ్ నాయక్ సినిమా రీరిలీజ్ కు రెడీ అవుతుంది.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేసిన నాయక్. మాఫీయా బ్యాక్ డ్రాప్ లో నడిచే ఈసినిమా సూపర్ హిట్ కాదు.. అలా అని డిజాస్టర్ అవ్వలేదు.. పర్వాలేదు అనిపించింది. ఇక ఈ సినిమాని మళ్ళీ థియేటర్స్ లోకి తీసుకు వచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమాను రీరిలీజ్ చేయడం కోసం మేకర్స్ వెతుక్కున్న అకేషన్..మెగాస్టార్ బర్త్ డే. ఈనెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సెలబ్రేషన్స్ లో భాగంగా నాయక్ ని రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. వి వి వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా 2013 లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్టుగా నిలిచింది.